
రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నాసిరకం బొగ్గు సరఫరా
తమిళనాడు, ఏపీకి మాత్రం నాణ్యమైన బొగ్గు
నాణ్యతలేమి బొగ్గుతో సరిగా పనిచేయని థర్మల్ కేంద్రాలు
ఆర్థిక భారమవుతోందంటూ సింగరేణికి జెన్‌కో సీఎండీ లేఖ
సాక్షి, హైదరాబాద్: అవి రెండూ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలే. కానీ ఒక సంస్థ మరో సంస్థపై వివక్ష చూపుతోంది. వాటిలో ఒకటి సింగరేణి.. మరొకటి టీజీజెన్‌కో. నాసిరకం బొగ్గుతో ఒక సంస్థ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయలేక.. ఉత్పత్తి కేంద్రాలను బలవంతంగా మూసుకోవాల్సిన దుస్థితి. తెలంగాణ విద్యుదుత్పాదనకు నాసిరకం బొగ్గు సరఫరా చేస్తూ.. పొరుగు రాష్ట్రాలకు సింగరేణి మేలు రకం బొగ్గు అందిస్తోంది. దీనిపై జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ స్వయంగా సింగరేణి సీఎండీకి రెండు రోజుల క్రితం సుదీర్ఘ లేఖ రాశారు.
నాణ్యత లేని బొగ్గుతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాటిని బ్యాక్‌డౌన్ చేయడం లేదా సామర్థ్యం తగ్గించుకుని ఉత్పత్తి చేయడం వల్ల బొగ్గు వినియోగం పెరుగుతోందని, తద్వారా తమ పై భారం పడుతోందని చెప్పారు. జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఉపయోగించే బొగ్గు మొత్తం (ఏటా 28.872 మిలియన్ టన్నులు) సింగరేణి నుంచే కొనుగోలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
తక్కువ గ్రేడ్ రకంతో ఇబ్బందులు
కేటీపీఎస్–6 (500 మెగావాట్లు), కేటీపీఎస్–7 (800 మెగావాట్లు), కేటీపీపీ–1 (500 మెగావాట్లు), బీటీపీఎస్ (4 ్ఠ270 మెగావాట్లు), వైటీపీఎస్ (800 మెగావాట్లు) తదితర థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నత శ్రేణి బొగ్గు వినియోగించేలా రూపొందించినవని జెన్‌కో సీఎండీ లేఖలో చెప్పారు. ఒప్పందం ప్రకారం కాకుండా తక్కువ గ్రేడ్ బొగ్గు సరఫరా వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు.
దీంతో సామర్థ్యాన్ని తగ్గించుకొని ఉత్పత్తి చేయడం, బాయిలర్స్ దెబ్బతినడం, త్వరగా యంత్రాలు వేడెక్కడం, అధికంగా బూడిద రావడం లాంటివి జరుగుతున్నాయన్నారు. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి లో నష్టం వాటిల్లుతోందని చెప్పారు. అదే ఏపీలోని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌కు, అలాగే తమిళ నాడులోని థర్మల్ కేంద్రాలకు మాత్రం నాణ్యమైన బొగ్గు సరఫరా చేస్తున్నారని ఆక్షేపించారు.
85% పీఎల్‌ఎఫ్ తగ్గితే..
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ జెన్‌కో థర్మల్ కేంద్రాలకు 85 % పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధారణంగా నిర్ధారించిన దానికంటే తగ్గితే ఆ మేరకు ఫిక్స్‌డ్ చార్జీలు తగ్గుతాయని సంస్థ సీఎండీ పేర్కొన్నారు. బ యటి రాష్టాలకు మేలైన బొగ్గు సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, రాష్ట్రంలో సింగరేణి గనులు ఉన్నందున జెన్‌కోకు నాణ్యమైన బొగ్గు సరఫరా చే యాలని జెన్‌కో సీఎండీ కోరారు. పెరుగుతున్న డి మాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే.. ఉన్నతశ్రేణి బొగ్గు సరఫరా చేయాలన్నారు.