
సాక్షి,హైదరాబాద్: కామారెడ్డి జిల్లా ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.
పోలీసుల వివరాల మేరకు.. బుధవారం (అక్టోబర్ 15) బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద ప్రయాణిస్తున్న స్కూటీని రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటన స్థలంలో మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని అత్యవసర చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మరో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నలుగురు మరణానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.