LBnagar Metro: ఎల్బీనగర్‌ మెట్రోస్టేషన్‌ ఫుల్‌.. కిలోమీటర్‌ క్యూ | Massive Rush At LB Nagar Metro Station With Passengers Amid Post Dussehra Rush, Watch Videos Went Viral | Sakshi
Sakshi News home page

Crowd At LB Nagar Metro: ఎల్బీనగర్‌ మెట్రోస్టేషన్‌ ఫుల్‌.. కిలోమీటర్‌ క్యూ

Oct 6 2025 11:20 AM | Updated on Oct 6 2025 12:03 PM

Passengers Huge Crowd At LbNagar Metro Station

సాక్షి, ఎల్బీనగర్‌: ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌(LbNagar Metro) వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దసరా తర్వాత సొంతూళ్ల నుంచి అందరూ సిటీకి చేరుకున్నారు. అనంతరం, ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపించడంతో మెట్రో స్టేషన్‌ వద్ద భారీగా సందడి నెలకొంది.

అయితే, ఒక్కసారిగా మెట్రో వద్దకు ప్రయాణికులు చేరుకోవడంతో టికెట్‌ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో మెట్రో రైలు సిబ్బంది.. ప్రయాణికులను క్యూ పద్దతిలో పంపిస్తున్నారు . ఈ క్రమంలో కిలోమీటర్ మేర ప్రయాణికులు లైన్ కట్టిన పరిస్థితి ఉంది. క్యూలైన్ల నుంచి ప్లాట్‌ఫామ్‌కు చేరుకోడానికి దాదాపు రెండు గంటలు పడుతోంది. ఈ కారణంగా మెట్రో సిబ్బంది తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు.. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజూ భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి, చిట్యాల వద్ద వంతెన నిర్మాణ పనుల వల్ల ఈ సమస్య ఏర్పడింది. దసరా సెలవుల తర్వాత ప్రయాణికులు నగర బాట పట్టడంతో వాహనాల రద్దీ నెలకొంది.

ఇక, పంతంగి టోల్ ప్లాజాతో పాటు చౌటుప్పల్, దండు మల్కాపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్బీనగర్‌ చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. చింతలకుంట పైవంతెనపై ట్రావెల్స్‌ బస్సులు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌జామ్‌ కారణంగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement