ప్రస్తుతం బంగారం ధరలు(Gold price) రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది పుత్తడి ధరలు పడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2026 ద్వితీయార్థంలో బంగారం ధర గణనీయంగా తగ్గే అవకాశముందని ఏఎన్‌జెడ్ (ANZ) బ్యాంక్ అంచనా వేసింది.
ప్రస్తుత బంగారం ధరల పరిస్థితి
స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ కు 0.4 శాతం పెరిగి 4,224.79 డాలర్లకు చేరుకుంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ (డిసెంబర్ డెలివరీ) 0.9 శాతం పెరిగి 4,239.70 డాలర్లకు చేరుకుంది. భారత్‌లో ప్రస్తుతం (అక్టోబర్ 16) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,29,590 వద్ద ఉంది.
అనిశ్చిత భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, ఆర్థిక ఒడిదుడుకులు, యూఎస్ డాలర్ బలహీనత, వడ్డీ రేట్లు తగ్గే అంచనాలు అన్నీ కలిపి బంగారం ధరను ప్రస్తుతం ఆల్‌టైమ్ హై స్థాయికి చేర్చాయని నిపుణులు పేర్కొన్నారు.
ఏఎన్‌జెడ్ అంచనా
తక్కువ వడ్డీ రేటు వాతావరణంలో బాగా పనిచేసే అనిశ్చితి కాలంలో సురక్షితమైన ఆస్తిగా కనిపించే బంగారం ఇప్పటి వరకు 61 శాతం పెరిగింది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.1 శాతం పడిపోయి ఒక వారం కనిష్ట స్థాయికి చేరుకుంది.
ఏఎన్‌జెడ్ అంచనా ప్రకారం (Gold price prediction).. బంగారం ధరలు ఇదే విధంగా పెరిగి 2026 మొదటి ఆరు నెలలు శిఖరానికి చేరుకుంటాయి. 2026 జూన్ నాటికి బంగారం ధర ఔన్స్‌కు 4,400 డాలర్లకు చేరే అవకాశం ఉంది. అయితే, ఆ తర్వాత ఈ ఏడాది రెండో భాగంలో ధరలు పడిపోవొచ్చని ఏఎన్‌జెడ్ అంచనా వేసింది.
ఇదీ చదవండి: బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే: కమొడిటీ గురు జిమ్ రోజర్స్
వెండి కూడా..
2026 మధ్య నాటికి వెండి (Silver price) ఔన్స్ కు 57.50 డాలర్లకు చేరుకుంటుందని ఏఎన్‌జెడ్ బ్యాంక్ అంచనా వేసింది. ఏదేమైనా, హాకిష్ ఫెడ్ వైఖరి, ఊహించిన దానికంటే బలమైన యూఎస్ ఆర్థిక వృద్ధి ప్రతికూల ప్రమాదాలను కలిగిస్తుందని ఏఎన్‌జెడ్ హెచ్చరించింది.
(Disclaimer: బంగారం, వెండి గురించి నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. కొనుగోలుదారులకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


