
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా వస్తోన్న రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తెలుసుకదా. ఇప్పటికే ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీప్రసాద్ నిర్మించారు.
రిలీజ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో సిద్ధు సరదాగా నెటిజన్లతో ముచ్చటించారు. ట్విట్టర్ వేదికగా ఆస్క్ సిద్దు పేరుతో చిట్ చాట్ నిర్వహించారు. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధనాలిచ్చారు సిద్ధు. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ గురించి సైతం పలువురు అడిగారు. అంతేకాకుండా మీ ఫెవరేట్ హీరో ఎవరని కూడా ప్రశ్నించారు. దీనికి సిద్ధు తన నచ్చిన హీరో రణ్‌బీర్ కపూర్ అంటూ ఆన్సరిచ్చారు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ త్వరలోనే జరగనుందని రిప్లై ఇచ్చాడు.
Ranbir kapoor ! Fan boy moment Yet to happen
— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) October 16, 2025