
కోనసీమ జిల్లా: వివాహం జరిగి ఏడాది పూర్తి కాకుండానే భర్తతో పాటు అత్తింటి వేధింపులకు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై బి.జగన్మోహన్‌రావు గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన గొర్లి శిరీష (23), ఏనుగుతల ప్రదీప్‌కుమార్‌కు సుమారు ఐదు నెలల కిందట వివాహం జరిగింది. కాగా ప్రదీప్‌కుమార్ ఒంటిమామిడిలో దివీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
గోపాలపట్నంలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. కాగా బుధవారం సాయంత్రం ప్రదీప్‌కుమార్ ఉద్యోగానికి వెళ్లిన అనంతరం అత్తింటివారి వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై తెలిపారు. వివాహిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు.