
కలిసిసొచ్చిన జీఎస్‌టీ సంస్కరణలు
పండగ సీజన్ కొనుగోళ్ల దన్ను
సియామ్ గణాంకాల వెల్లడి
న్యూఢిల్లీ: జీఎస్‌టీ సంస్కరణ, పండుగ సీజన్ కలిసిరావడంతో తయారీదార్ల నుంచి డీలర్లకు ప్యాసింజర్ వాహనాలు, ద్వి చక్రవాహనాల సరఫరా గణనీయంగా పెరిగాయి. పెరిగిన టోకు విక్రయాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగా ముగించవచ్చనే ఆశాభావంతో వాహన పరిశ్రమ ఉన్నట్లు సియామ్ పేర్కొంది.
‘‘కొత్త జీఎస్‌టీ ధరలు సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చినప్పట్టకీ.., కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్స్, త్రీ వీలర్స్ విభాగాలు గతంలో ఎన్నడూ లేనంతగా సెపె్టంబర్‌లో అత్యధిక అమ్మకాలు నమోదు చేశాయి. ప్రభుత్వం జీఎస్‌టీ 2.0 అమల్లోకి తీసుకురావడమనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇది ఆటో పరిశ్రమలో కాకుండా, మొత్తం ఆర్థికవ్యవస్థలో చైతన్యం తీసుకొస్తుంది’’ అని సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు.
→ కంపెనీలు సెపె్టంబర్‌లో డీలర్లకు 3,72,458 ప్యాసింజర్ వాహనాలను పంపిణీ చేశాయి. గతేడాది ఇదే నెలలో పంపిణీ 3,56,752 యూనిట్లతో పోలిస్తే ఇవి 4% అధికం.
→ ద్వి చక్రవాహన విక్రయాలు 7% వృద్ధి చెంది 21,60,889 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 20,25,993 టూ వీలర్స్ అమ్ముడయ్యాయి.
→ త్రీ చక్రవాహన టోకు అమ్మకాలు 79,683 నుంచి 84,077 యూనిట్లకు పెరిగాయి.
త్రైమాసిక ప్రాతిపదికన....
వార్షిక ప్రాతిపదికన క్యూ2లో 10.39 లక్షల పీవీ అమ్మకాలు అమ్ముడయ్యాయి. టూ వీలర్స్ విక్రయాలు 7% వృద్ధి చెంది 55.62 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. త్రి చక్రవాహన విక్రయాలు 10% వృద్ది చెంది 2,29,239 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇదే సెప్టెంబÆ Š‡ త్రైమాసికంలో 2.4 లక్షల వాణిజ్య వాహన విక్రయాలు జరిగాయి.