Top Stories
ప్రధాన వార్తలు
మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాల్ని అంచనా వేశారు. ‘‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జూన్4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. ‘‘ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏమీ లేదు. అంతా టీమే చేస్తుంది. వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ అన్నారు.ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీగా ఐప్యాక్ పని చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్‌లో ఉన్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(I-Pac) కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్.. సుమారు అరగంటపాటు అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐ-ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ టీం సభ్యులతో సెల్ఫీలు దిగుతూ కాసేపు సరదాగా గడిపారు.
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఈసీ ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేయగా, పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెన్షన్ చేసింది.పల్నాడు, అనంతపురం, తిరుపతి లోని 12 మంది సబ్బార్డినేట్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ.. శాఖపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించింది. అల్లర్లకు పాల్పడిన వారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించిన ఈసీ.. 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను కొనసాగించాలని పేర్కొంది.అనంతపురం: జేసీ వర్గానికి వత్తాసు పలికి..తాడిపత్రిలో జేసీ వర్గానికి వత్తాసు పలికిన అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌ను ఈసీ సస్పెండ్ చేసింది. ఎన్నికల పోలింగ్ సమయంలో ఎస్పీ వివాదాస్పదంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వందల మంది టీడీపీ కార్యకర్తలతో సంచరిస్తున్నా ఎస్పీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసినా కానీ ఎస్పీ అమిత్ బర్దర్ సకాలంలో స్పందించలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసేలా ఎస్పీ ఆదేశాలను చేసిన ఎస్పీ.. ఎన్నికల వేళ రౌడీషీటర్లను కూడా బైండోవర్ చేయలేదు.తిరుపతి: సర్పంచ్ ఇంటికి టీడీపీ మూకలు నిప్పు.. స్పందించని ఎస్పీచంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై ఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిగారి పల్లి పంచాయితీ కూచి వారి పల్లి లో సర్పంచ్ కోటాల చంద్ర శేఖర్ రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు దాడి చేశారు. సర్పంచ్ ఇంటికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టి.. దాడి చేసినా కానీ సకాలంలో ఎస్పీ స్పందించలేదు.కాగా, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు చేపట్టింది.
‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
ఏపీ రాజకీయ చరిత్రలోనే వైఎస్సార్సీపీ సరికొత్త చరిత్ర లిఖించబోతుంది. ‘ఫ్యాన్’ ప్రభంజనం సృష్టించబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనకు ప్రజలు జైకొట్టారు. ప్రతిపక్షాలు, పచ్చ బ్యాచ్ దిమ్మతిరిగిపోయే విధంగా ప్రజలు తీర్పునిచ్చినట్టు సీఎం జగన్ ప్రకటన చేశారు.సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజలే తనకు స్టార్ క్యాంపైనయిర్స్ అని చెప్పారు. తాను నమ్మకుంది ఆ దేవుడు, ప్రజలనేనని అన్ని వేదికలపైనా ప్రస్తావించారు. ఇక, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందితేనే వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని కోరారు. ఆయన మాటలు ప్రతీ ఒక్క కుటుంబాన్ని చేరుకున్నాయి. సీఎం జగన్ చేసిన సాయాన్ని ఎవరూ మరిచిపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వం పట్ల, పాలన పట్ల నమ్మకం ఉంచారు.అందుకే 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే భారీగా ఓట్లు వేశారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగడం కూడా ఇందుకు ఒక ఉదాహారణ. ఇక, 2019లో వచ్చిన సీట్ల కన్నా ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని సీఎం జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, సీఎం జగన్ ఇప్పటి వరకు చేసిన ఏ ప్రకటన అయినా ఆచితూచి మాత్రమే చేశారు.పేదలు వర్సెస్ పెత్తందారులు అన్న ఎన్నికల నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన సీఎం జగన్.. ఈసారి వచ్చే ఫలితాలు ప్రభంజనం సృష్టిస్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా విజయంపై కచ్చితమైన సమాచారంతోనే ఆయన ఇలాంటి ప్రకటన చేశారని రాజకీయ వర్గాలు సైతం చెబుతున్నాయి. సీఎం జగన్ సంచలన ప్రకటనతో కూటమి నేతలు డీలా పడినట్టు తెలుస్తోంది.అయితే, ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా ప్రాక్టికల్‌గా ఉండే వ్యక్తి. ఆయన ఏ పని చేసినా పూర్తి పారదర్శకంగా ఉంటారు. వేర్వేరు సమీకరణాలు అన్నీ పరిశీలించి ముందడుగు వేస్తారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల మార్పు సమయంలో కూడా కచ్చితమైన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రతిపక్షాలు, సీఎం జగన్ అంటే గిట్టని వారు ఎన్ని కామెంట్స్ చేసినా ఆయన అవేవీ పట్టించుకోకుండా ముందుకుసాగారు. ఎంతో దమ్ము, ధైర్యంతో అభ్యర్థులను మార్చారు. ఒక నాయకుడిగా తన నాయకత్వం మీద, పార్టీ మీద, పాలన మీద ఉన్న నమ్మకాన్ని ఈ ప్రకటన సంకేతంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఫస్ట్ రియాక్షన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు టైట్ ఫైట్, ఎవరికి ఎడ్జ్ తెలియదన్నట్టుగా వార్తలు రాసుకొచ్చిన మీడియా సంస్థలు కూడా.. సీఎం జగన్ చేసిన ప్రకటన పట్ల షాక్ తిన్నాయి. ఒక నాయకుడు.. ఎంతో నమ్మకంగా చేసిన ఒక ధృడమైన ప్రకటన.. వైనాట్ 175 నినాదాన్ని చర్చనీయాంశం చేశాయి.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు ఎస్ఆర్హెచ్
ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షార్పణం అయింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయింది. చాలాసేపు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. కాసేపు విరామం ఇచ్చినా మళ్లీ కురిసింది. దీంతో ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.ప్లే ఆఫ్స్‌కు చేరిన ఎస్ఆర్హెచ్కాగా ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకి ఒక్కో పాయింట్ లభించింది. దీంతో 15 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కి ఆర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ 15 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్.. ఏడింట విజయాలు సాధించగా, ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక ప్లే ఆఫ్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అర్హత సాధించగా.. మరో స్ధానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ, లక్నో, ఢిల్లీ జట్లు పోటీ పడుతున్నాయి.
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్‌లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కొంతమంది బలహీనత వల్లే పీఓకేపై భారత్ నియంత్రణ కోల్పోయిందని ఆరోపించారు. ఒకరు చేసిన పొరపాటే దీనికి కారణమని చెప్పారు. భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ఉద్ధేశిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ‘విశ్వబంధు భారత్’ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ పీఓకేపై జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ విలీనం చేసుకునే విషయమై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు.లక్ష్మణ రేఖ వంటిది ఏదీ లేదని పేర్కొన్నారు. భారత్‌లో పీఓకే అంతర్భాగమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి బలహీనత వల్లే పీఓకే తాత్కాలికంగా మన నుంచి చేజారిందని, దానిపై పట్టు కోల్పోవడానికి వారి పొరపాటే కారణం అని నెహ్రూపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. విశ్వ వేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని, స్వీయ విశ్వాసాన్ని ఏనాడూ వీడొద్దన్నారు.చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, పాక్‌తో బీజింగ సహకారంపై జై శంకర్ విమర్శలు గుప్పించారు. ‘నేను చైనా రాయబారిగా ఉన్నాను, చైనా గత చర్యల గురించి మనందరికీ తెలుసు. ఈ భూమిని పాకిస్తాన్ లేదా చైనా తమదని చెప్పుకోలేదని మేము వారికి పదేపదే చెప్పాము. సార్వభౌమాధికారం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే, అది భారతదేశం. మీరు ఆక్రమిస్తున్నారు, మీరు అక్కడ నిర్మిస్తున్నారు, కానీ చట్టపరమైన హక్కు మాదే.’నని పేర్కొన్నారు.చైనా పాకిస్తాన్ మధ్య 1963 సరిహద్దు ఒప్పందాన్ని కూడా జైశంకర్ ఎత్తి చూపారు. అక్కడ పాకిస్తాన్ దాదాపు 5,000 కి.మీ భూభాగాన్ని చైనాకు అప్పగించిందని అన్నారు. ‘1963లో, పాకిస్తాన్- చైనా తమ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. చైనాను దగ్గరగా ఉంచడానికి, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దాదాపు 5,000 కి.మీలను డ్రాగన్‌కు అప్పగించింది. ఈ ప్రాంతం భారతదేశానికి చెందింది’ ఆయన తెలిపారు.
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: సీఎం జగన్ విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ చేసేదే చెప్తారు.. మంచి జరిగే నిర్ణయాలనే తీసుకుంటారన్నారు.ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే ఉండాలని కోరుకున్నారు. టీడీపీ అసహనంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. వైనాట్ 175 లక్ష్యానికి దగ్గరగా సీట్లు గెలవబోతున్నాం. మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావాలనే విధంగా ప్రజలు ఓటింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని వర్గాలవారిని సమానంగా చూసిన వ్యక్తి సీఎం జగన్ ఎన్టీఆర్, వైఎస్సార్ హయాంలో వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి.’’ మంత్రి బొత్స చెప్పారు.‘‘మేము అధికారంలోకి రాగానే అందరూ తోక ముడుస్తారు. టీడీపీ అసహనంతో దాడులు చేసింది. మేము సంయమనం పాటిస్తున్నాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయండని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్. గతంలో చంద్రబాబు హామీలు ఇచ్చి మాట తప్పారు. బాబుకు అధికారం ఇస్తే మళ్లీ కష్టాలు వస్తాయి.. మళ్లీ పెత్తందారులు వస్తారని ప్రజలు భయపడ్డారు. చంద్రబాబుది మేకపోతు గాంభీర్యం’’ అంటూ మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
సాక్షి, ఢిల్లీ: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భేష్ అన్న నీతి ఆయోగ్.. ఈ చట్టం తో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రం అని.. భూములపై రైతులకు సర్వహక్కులు లభిస్తాయని పేర్కొంది.పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని.. ఈ చట్టంతో భూ పరిపాలన మరింత సులువవుతుందన్న నీతి ఆయోగ్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారానికి చెక్ పెట్టింది. సాక్షి డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్ వెంకటేష్ అడిగిన ఆర్టీఐ ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం పంపింది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్” కు వ్యతిరేకంగా జరిగిన విస్తృత ప్రచారానికి నీతి అయోగ్ వివరణతో రైతుల్లో భరోసా, నమ్మకం పెరగనుంది. ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై రైతుల అనుమానాలు తొలగనున్నాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై రైతులను తప్పుదోవ పట్టించిన ప్రచారానికి చెల్లు చీటీ పడింది.అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నీతి ఆయోగ్ సమాధానం పంపింది. నీతి ఆయోగ చైర్మనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాగా, టీడీపీ-జనసేన కూటమి దుష్ప్రచారానికి ఇక చెక్ పడినట్లే.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో రైతులకు టైటిల్ పై పరిపూర్ణ హక్కుల లభిస్తాయని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేశారు. సీఎం జగన్ మాటనే బలపరుస్తూ నీతి ఆయోగ్ సమాధానం ఇచ్చింది. ఈ అంశంతో మరోసారి విశ్వసనీయతకు సీఎం జగన్ మారుపేరుగా నిలిచారు.కాగా, ఓటమి భయంతో చంద్రబాబు గ్యాంగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసింది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్ జగన్‌పైన, ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి, ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీచమైన ప్రచారానికి ఒడిగట్టింది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మార్చింది.భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.ప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది.
బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం
గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.Crossing milestones even before it hits the roads. A big thank you to all our customers who have made this possible. Be a part of our journey, book now: https://t.co/P7UUnkoyxv#XUV3XO #EverythingYouWantAndMore #The3XFactor pic.twitter.com/HMNylKisa1— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) May 15, 2024
SRH vs GT: మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. హెచ్‌సీఏ కీలక ప్రకటన
ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారీ వర్షం కారణంగా ఉప్పల్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు.అయితే ఇంకా చిన్నపాటి జల్లు కురుస్తుండడంతో సెంట్రల్ పిచ్‌ను మాత్రం కవర్స్‌తో కప్పి ఉంచారు. దీంతో టాస్ ఆలస్యం కానుంది. ఇక ఈ మ్యాచ్ నిర్వహణపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కీలక ప్రకటన చేశారు. వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మైదానాన్ని సిద్దం చేసుందుకు 100 మందికి పైగా గ్రౌండ్ స్టాప్ శ్రమిస్తున్నారని జగన్ మోహన్ రావు తెలిపారు. మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10.30 వరకు సమయం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
భారతీయ పర్యాటకులకు శుభవార్త.. ఇక ఆ దేశంలో 'ఫోన్ పే' సేవలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలుదేశాల్లో అందుబాటులో ఉన్న 'ఫోన్ పే' ఇప్పుడు తాజాగా 'లంకాపే'తో చేతులు కలిపింది. ఇది భారతీయ పర్యాటకులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి.శ్రీలంకకు వెళ్లే భారతీయులు ఇకపై ఫోన్ పే యాప్‌తో లంకాపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేయవచ్చు. ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో భారతీయ పర్యాటకులు శ్రీలంకకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.ఇప్పటికే ఫోన్ పే సేవలు సింగపూర్, నేపాల్ వంటి దేశాల్లో అమలులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా శ్రీలంక దేశంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.శ్రీలంకలో ప్రారంభమైన ఫోన్ పే సేవల సందర్భంగా.. లంకాపే సీఈఓ చన్నా డి సిల్వా మాట్లాడుతూ, భారతీయ పర్యాటకులు, బిజినెస్ ప్రయాణీకులకు శ్రీలంక పర్యటన సమయంలో చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరిచే దిశలో ఇది కీలక అడుగు అన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక గవర్నర్ నందలాల్ వీరసింగ్ స్పందిస్తూ.. పోటీతత్వాన్ని, శ్రీలంక వ్యాపారులకు ప్రయోజనాలను పెంపొందించడానికి చాలా ఉపయోగకరంగా ఉండదని అన్నారు. ఈ కార్యక్రమానికి బ్యాంకింగ్ అండ్ టూరిజం రంగాల ప్రతినిధులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో సహా శ్రీలంకకు చెందిన ముఖ్య వాటాదారులు హాజరయ్యారు.
తప్పక చదవండి
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
సినిమా
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం "లారి చాప్టర్ -1". యూట్యూబ్‌లో తన వీడియోలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీకాంత్ రెడ్డి హీరోగా వెండి తెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా చంధ్ర శిఖ నటించనుండగా.. రాఖీ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై ఆసం వెంకట లక్ష్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆసం మాట్లాడుతూ..'చెన్నై లయోల కాలేజీలో డైరెక్షన్ కోర్స్ చేసిన మొదట యూట్యూబ్‌లో నా కెరీర్ ప్రారంభించాను. మంచి పాపులారిటీ వచ్చింది. అలాగే చాలా సినిమాలకు వివిధ శాఖలలో పని చేశాను. ఇప్పుడు "లారి చాప్టర్ -1" అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నా. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషలో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నా. నా మొదటి సినిమా అందరికీ నచ్చుతుంది"' అని తెలిపారు.
యాక్టర్స్‌గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ..'సినిమా అంటే నాకు ప్రాణం. ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్లు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు ఎంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.నిర్మాత చంటి యలమాటి మాట్లాడుతూ..' మంచి హిట్లు ఇచ్చిన డైరెక్టర్లను యాక్టర్లుగా మార్చిన సినిమానే నటరత్నాలు. డైరెక్టర్ శివ నాగు ఈ కథ చెప్పడం జరిగింది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అవ్వాలని కలలు గనే యువత చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది' అని అన్నారు. ఈ చిత్రంలో అర్జున్ తేజ్, అర్చన, సుమన్ శెట్టి, సూర్యకిరణ్, ఏ. ఎస్ రవికుమార్ చౌదరి, టైగర్ శేషాద్రి కీలక పాత్రలు పోషించారు.
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారంలో థియేటర్ల వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. స్టార్ హీరోల సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీలవైపే చూస్తున్నారు. దీంతో ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్‌తో వినోదం అందించేందుకు రెడీ అయ్యాయి.ఎప్పటిలాగే ఈ వీకెండ్లో అలరించేందుకు సినిమాలు వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ఆదాశర్మ నటించిన బస్తర్, రాజమౌళి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) ఆడియన్స్‌లో కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సైతం స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 10కి పైగా సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యే సినిమాలునెట్ఫ్లిక్స్ పవర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 17 ద 8 షో (కొరియన్ సిరీస్) - మే 17 థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17 అమెజాన్ ప్రైమ్ 99 (ఇంగ్లీష్ సిరీస్) - మే 17డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) - మే 17జీ5 బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) - మే 17 తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) - మే 17జియో సినిమా జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) - మే 17ఆపిల్ ప్లస్ టీవీ ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 17ఎమ్ఎక్స్ ప్లేయర్ ఎల్లా (హిందీ సినిమా) - మే 17
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తామిద్దర పరస్పరం అంగీకారంతోనే విడిపోతున్నట్లు జీవీ ప్రకాశ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని.. ప్రైవసీకి భంగం కలిగించొద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. అయినప్పటికీ ఈ జంటపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ విమర్శిస్తున్నారు.తాజాగా తమపై వస్తున్న ట్రోల్స్‌పై సింగర్ సైంధవి స్పందించింది. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా యూట్యూబ్‌లో కొందరు వీడియోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నేను.. ప్రకాశ్ ఆలోంచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ మా నిర్ణయాన్ని గౌరవించాలని అభ్యర్థించారు. ఇలా ఒకరిపై ఆరోపణలు చేయడం దారుణమని వాపోయారు. మేమిద్దరం 24 ఏళ్లుగా మంచి స్నేహితుల్లా ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ తమ స్నేహా బంధాన్ని కొనసాగిస్తామని సైంధవి పేర్కొన్నారు. కాగా.. అంతకుముందే ట్రోల్స్ పట్ల జీవీ ప్రకాశ్ సైతం స్పందించారు. దయచేసి తమ పట్ల ట్రోల్స్ చేయడం సరైంది కాదని హితవు పలికారు.
ఫొటోలు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)
ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
‘సర్.. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)
క్రీడలు
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబు ల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం మరో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–11తో జి సావో నాన్–జెంగ్ వె హాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ మైస్నం మిరాబా లువాంగ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ మణిపూర్ ఆటగాడు 21–14, 22–20తో మాడ్స్ క్రిస్టోఫెర్సన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అశ్విని–తనీషా ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–19, 21–17తో హంగ్ ఎన్ జు–లిన్ యు పె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అష్మిత (భారత్) 15–21, 21–12, 12–21తో హాన్ యువె (చైనా) చేతిలో ఓడిపోయింది.
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. ఈ ఏడాది సీజన్లో ఎలాగైనా టైటిల్ సాధించి తమ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన ఢిల్లీకు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా నిష్క్రమించింది.ఈ మెగా ఈవెంట్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించింది.ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకోవడంతో ఢిల్లీ ఆశలు ఆడియాశలు అయ్యాయి. ఒక ఈ మ్యాచ్ జరిగి ఎస్ఆర్హెచ్ ఓటమి పాలై ఉంటే మాథ్యమేటికల్‌గా ఢిల్లీకి ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో పంత్ సేన ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఏడింట విజయాలు, ఏడింట ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో 5వ స్ధానంతో సరిపెట్టుకుంది.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు ఎస్ఆర్హెచ్
ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షార్పణం అయింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయింది. చాలాసేపు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. కాసేపు విరామం ఇచ్చినా మళ్లీ కురిసింది. దీంతో ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.ప్లే ఆఫ్స్‌కు చేరిన ఎస్ఆర్హెచ్కాగా ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకి ఒక్కో పాయింట్ లభించింది. దీంతో 15 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కి ఆర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ 15 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్.. ఏడింట విజయాలు సాధించగా, ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక ప్లే ఆఫ్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అర్హత సాధించగా.. మరో స్ధానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ, లక్నో, ఢిల్లీ జట్లు పోటీ పడుతున్నాయి.
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్‌కు చుక్కలే: మిస్బా
వరల్డ్‌క్రికెట్‌లో బిగ్గెస్ట్ రైవలరీ అంటే టక్కున గుర్తు వచ్చేది భారత్-పాకిస్తాన్ మ్యాచే. ఈ దాయదుల పోరును వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటున్నారు. అభిమానుల నిరీక్షణకు తెరదించే సమయం అసన్నమవుతోంది. ఈ చిరకాల ప్రత్యర్ధిలు మరోసారి అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నారు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ తమ జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో చాలా జాగ్రత్తగా ఉండాలని పాక్ జట్టును మిస్బా హెచ్చరించాడు."భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఎక్స్ ఫ్యాక్టర్. అతడు ఇప్పటికే చాలాసార్లు పాకిస్తాన్‌కు ఓటమిరూచిను చూపించాడు. పాకిస్తాన్‌పైన అతనికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలో చెలరేగిపోతాడు. విరాట్ ఎప్పుడూ ఒత్తడితో ఆడినట్లు నేను చూడలేదు. విరాట్ ఒక టాప్-క్లాస్ క్రికెటర్. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉంది. విరాట్‌ను ఆపాలంటే ప్రత్యేక వ్యూహాలను రచించాలి. అతని స్ట్రైయిక్ రేటు పెద్ద విషయమే కాదు. అతడు తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోడు. కోహ్లి విమర్శలను పొగడ్తలగా భావించి మరింత రాటుదేలుతాడని" స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్బా పేర్కొన్నాడు.
బిజినెస్
బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం
గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.Crossing milestones even before it hits the roads. A big thank you to all our customers who have made this possible. Be a part of our journey, book now: https://t.co/P7UUnkoyxv#XUV3XO #EverythingYouWantAndMore #The3XFactor pic.twitter.com/HMNylKisa1— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) May 15, 2024
మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?
దేశీయ మార్కెట్లో మోటోరోలా కంపెనీ తన 'ఎడ్జ్ 50 ఫ్యూజన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త ఫోన్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారతీయ విపహ్లవు లాంచ్ అయిన కొత్త మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రారంభ ధర రూ. 22999 (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్), 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24999. ఈ మొబైల్ మే 22 నుంచి మోటోరోలా.ఇన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో ప్రముఖ రిటైల్ స్టోర్‌లో కూడా విక్రయానికి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలతో రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ వేగన్ లెదర్ ముగింపుతో హాట్ పింక్,మార్ష్మల్లౌ బ్లూ కలర్‌వేస్‌లో మాత్రమే కాకుండా.. పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) ముగింపుతో ఫారెస్ట్ బ్లూ కలర్ ఎంపికలో కూడా అందుబాటులో ఉంటుంది.లేటెస్ట్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7 ఇంచెస్ ఫుల్ HD+ (1,0800x2,400 పిక్సెల్‌లు) pOLED కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. ఇది క్వాల్కామ్ 4ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 68 వాట్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది.కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై-6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. బయోమెట్రిక్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి.
2024 ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితా
ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా తొమ్మిదవ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 300 మంది యువ పారిశ్రామికవేత్తలు, లీడర్స్, ట్రయల్బ్లేజర్లు ఉన్నారు. వీరి వయసు 30 ఏళ్లకంటే తక్కువ.అండర్ 30 ఆసియా క్లాస్ ఆఫ్ 2024లో ది ఆర్ట్స్, ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్, మీడియా మొదలైన 10 విభాగాల్లో 300 మంది ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్నవారిలో కే-పాప్ గర్ల్, సింగపూర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ వెరోనికా శాంతి పెరీరా, అషియా సిటీకి చెందిన జపాన్ యొక్క అతి పిన్న వయస్కుడైన మేయర్ రియోసుకే తకాషిమా మొదలైనవారు ఉన్నారు."30 అండర్ 30 ఆసియా" జాబితాసియాన్ డాసన్ - ఆస్ట్రేలియా: ది ఆర్ట్స్మెటల్ బ్యాండ్ - ఇండోనేషియా: ఎంటర్టైన్మెంట్ & స్పోర్ట్స్అలీనా నదీమ్ - పాకిస్తాన్ : ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్ఎరికా ఎంగ్ - మలేషియా: మీడియా, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్యూమీ హ్వాంగ్ - సౌత్ కొరియా: రిటైల్ & ఇకామర్స్జు యుయాంగ్ - చైనా: ఎంటర్ప్రైజ్ టెక్నాలజీఅక్షిత్ బన్సల్ & రాఘవ్ అరోరా - ఇండియా: ఇండస్ట్రీ, మాన్యుఫ్యాక్టరింగ్ & ఎనర్జీజాంగ్ జికియాన్ - చైనా: హెల్త్‌కేర్ & సైన్స్భాగ్య శ్రీ జైన్ - ఇండియా: సోషల్ ఇంపాక్ట్జాన్సన్ లిమ్ - సింగపూర్: కన్స్యూమర్ టెక్నాలజీ
పుంజుకున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 194 పాయింట్లు లాభపడి 22,394 వద్దకు చేరింది. సెన్సెక్స్ 649 పాయింట్లు పుంజుకుని 73,636 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, భారతీఎయిర్ఎల్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, నెస్లే కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వీడియోలు
ఐడియా అదిరింది
వంట చేసే రోబో రెడీ
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..
ఏలూరు లో ఘోరం..!
డీలా పడ్డ కూటమి
ఈసీకి వివరణ
మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది
కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు
ఫ్యామిలీ
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
పతీ ఏడాది మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రక్తపోటు స్థాయి సాధారణ స్థాయి కంటే పెరగడాన్నే హైపర్‌టెన్షన్ అంటారు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. అధిక రక్తపోటు లేదా హై బీపీను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది వచ్చిన సంగతి కూడా వ్యక్తులు కనిపెట్టలేకపోవచ్చు. ఈ నేపథ్యంలో హైబీపీ లక్షణాలు, నివారణ మార్గాలను ఒకసారి పరిశీలిద్దాం.వరల్డ్ హైపర్‌టెన్షన్ డేను 85 జాతీయ రక్తపోటు సంఘాలు లీగ్‌లతో కూడిన వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ దీన్ని ప్రారంభించింది. హైపర్‌టెన్షన్‌పై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.హైపర్ టెన్షన్ లక్షణాలుసాధారణంగా హైబీపీ కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అయితే రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వారు స్ట్రోక్, గుండె జబ్బులు , మూత్రపిండాల రుగ్మతలు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటారు. అధిక ఒత్తిడి రక్తపోటుకు దారితీయవచ్చు.తీవ్రమైన తలనొప్పి, ఛాతి నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడంతల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందివికారం, వాంతులు అస్పష్టమైన దృష్టి లేదా ఇతర దృష్టి మార్పులుఆందోళన, గందరగోళంచెవుల్లో శబ్దాలు, ముక్కు రక్తస్రావం హైపర్ టెన్షన్ చికిత్స ఆహారంలో ఉప్పును బాగా తగ్గించడం శారీరకంగా చురుగా ఉండటంధూమపానం, మద్యపానాన్ని మానేయడంబరువు ఎక్కువగా ఉంటే తగ్గడంజాగ్రత్తలుకూరగాయలు పండ్లు ఎక్కువ తీసుకోవడంగంటల తరబడి కూర్చోకుండా ఉండటంనడక, పరుగు, ఈత, డ్యాన్స్ లేదా బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలువారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ, లేదా వారానికి 75 నిమిషాల నడక ఉండాలి. ప్రతి వారం 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు వ్యాయామాలు చేయండి. తద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు ఆరోగ్య నిపుణులు సూచించిన మందులను తీసుకోవాలి. నోట్ : ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్తపోటును ముందుగానే గుర్తిస్తే నియంత్రణ సాధ్యమవుతుంది.
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్‌ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
మాస్ట్రో సంజయ్ లీలా బన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్‌తో డిజిటల్ ప్రపంచంలోకి ఆకట్టుకునేలా అడుగుపెట్టాడు. సంచలన టీవీ సిరీస్‌తో సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాడు. పలువురు నటీమణులు తమ అద్బుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా వీటన్నింటికి మించి గోల్డెన్ గర్ల్ వీడియో నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.హర్షాలీ మల్హోత్రా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ ‘‘బజరంగీ భాయిజాన్’’లో మున్నీ పాత్రలో నటించి, ప్రశంసలందుకున్న హర్షాలీ మల్హోత్రా లేటెస్ట్ సంచలనం. హీరామండిలోని అలంజేబ్ పాత్రను రీక్రియేట్ చేసింది. ఇందులో తనదైన నటనతో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) ఈ ధారావాహికలోని ‘‘ఏక్ బార్ దేఖ్ లిజియే’’ పాటకు తనదైన అభియనంతో వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. గోల్డెన్ కలర్ లెహంగాలో మల్హోత్రా మెరిసిపోయింది. అందమైన ఆమె కళ్ళు అనేక భావోద్వేగాలను అలవోకంగా పలికించడం విశేషం. దీంతో ఒరిజినల్ సాంగ్‌తో పోలిస్తే మల్హోత్రా బాగా నటించిందంటూ అంతా కితాబిచ్చారు.1940లలోని భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యానికి వ్యతిరేకంగా, ‘‘హీరామండి’’ లాహోర్‌లోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్ హీరా మండిలో తవాయిఫ్‌ల (వేశ్యల) జీవితాల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. స్టార్-స్టడెడ్ సిరీస్‌లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ అధ్యాయాన్ వంటి ప్రఖ్యాత నటీనటులు ఉన్నారు. ఇంకా శేఖర్ సుమన్, తహా షా బదుషా, ఫరీదా జలాల్తదితరులు మరికొందరు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో వెబ్ సిరీస్ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన షోగా నిలిచిన సంగతి తెలిసిందే.
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్లో పరిచయం అవసరంలేని అందమైన జంట ప్రిన్స్ మహేష్ బాబు, నటి నమ్రతా శిరోద్కర్ది. పెళ్లి తరువాత నటనకు గుడ్ బై చెప్పి నమ్రత కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. వీరి ముద్దుల తనయ సితార నటిగా, మోడల్‌గా ఇప్పటికే తన హవాను చాటుకుంటోంది. అయితే తాజాగా నమ్రత వర్కౌవుట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. దీంతో వదినమ్మ ఎందుకింత కసరత్తు చేస్తోందంటూ ఫ్యాన్స్ చేస్తున్న ఊహాగానాలు వైరల్‌గా మారాయి.2004 నుండి పెద్ద స్క్రీన్కు దూరంగా ఉన్నారు నమ్రత. అయితే సోషల్ మీడియా అభిమానులకు అప్డేట్స్ మాత్రం అస్సలు మర్చిపోదు. భర్త , సూపర్ స్టార్ మహేష్ బాబు, పిల్లలు సితార గౌతమ్ గురించి తరచుగా పోస్ట్ చేస్తుంది. తాజాగా మాజీ మిస్ ఇండియా ఇటీవల ఒక రీల్‌ను షేర్ చేసింది. ఆమె భారీ వర్కౌట్ సెషన్ చూసి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు.ఫిట్నెస్ కోసం ఆమె చేస్తున్న పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ‘‘బలమైన మహిళ!!’’ ‘‘సూపర్ వుమన్’’, , ‘‘వావ్’’, ‘‘బ్యూటిఫుల్’’ , ‘‘సూపర్ మామ్’’ అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) కాగా నమ్రతా గతంలో వివిధ సందర్భాలలో వర్కౌట్ వీడియోలను షేర్ చేసింది. గత ఏడాది మేలో, ట్రైనర్ కుమార్ మన్నవతో కలిసి హార్డ్‌కోర్ వ్యాయామాలు చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఆమె మళ్ళీ నటించనుందనే ఊహాగానాలకు దారితీసిన సంగతి తెలిసిందే.
బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!
కరోనా మహమ్మారి తర్వాత నుంచి ఆన్లైన్ షాపింగ్ అలవాటు పడిపోయారు జనాలు. అంతకు ముందు కూడా చేశారు గానీ. ఆ మహమ్మారి తర్వాత నుంచి ఆన్లైన్ షాపింగ్ మహా ఎక్కువయ్యింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇలానే ఓ మహిళ కొడుకు బ్లింకిట్ నుంచి పెద్ద మొత్తంలో కూరగాయాలు కొనుగోలు చేశాడు. డెలివరీ అయ్యాక బిల్ చూసి తల్లి షాకయ్యింది. ఏంటిది ఇంత మొత్తంలో కూరగాయాలు కొన్న కొత్తిమీరకు కూడా బిల్లు వేస్తారా అని విస్తుపోయింది. ఈ విషయమై తన కొడుకుతో చెప్పింది. తన తల్లి ఆలోచననను సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ..'నేను బ్లింకిట్ (Blinkit)లో కూరగాయలు కొనుగోలు చేశా. అందులో కొత్తిమీరకు కూడా డబ్బులు చెల్లించడం చూసి మా అమ్మకు బాధ కలిగింది. ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొన్నప్పుడు కొత్తిమీర ఉచితంగా ఇస్తే బాగుంటుంది కదా! అని ఆమె భావిస్తోంది.' అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీన్ని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధింద్సాకి ట్యాగ్ చేశారు. వినియోగదారుడు సోషల్ మీడియా పోస్ట్‌కి రెస్పాండ్ అయిన అల్మిందర్ ధింద్సా దీని గురించి పరిశీలిస్తామని చెప్పారు. ఆ తర్వాత జస్ట్ నాలుగు గంటల్లోనే ఫాలో అప్ పోస్ట్‌లో ధింద్సా ఫ్రీగా కొత్తిమీర ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అందరూ అంకిత్ సావంత్ తల్లిగారికి కృతజ్ఞతలు చెప్పండి. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ను మరింత అప్డేట్ చేస్తాం అని ధింద్సా పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, ఇలా ఓసామన్య వినియోగదారుడి పోస్ట్‌పై సీఈవో సత్వరమే స్పందించడంపై ప్రశంసల జల్లు కురిపించారు నెటిజన్లు. అంతేగాదు మరిన్నింటిని ఉచితంగా ఇవ్వొచ్చు అంటూ సలహలు ఇస్తూ పోస్టులు పెట్టారు.It’s live! Everyone please thank Ankit’s mom 💛 We will polish the feature in next couple of weeks. https://t.co/jYm2hGm67a pic.twitter.com/5uiyCmSER6— Albinder Dhindsa (@albinder) May 15, 2024 (చదవండి: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో)
న్యూస్ పాడ్‌కాస్ట్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
క్రైమ్
భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
యశవంతపుర: గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్యకు వీడియో కాల్ చేసి తిరిగి రావాలని అర్థించాడు ఓ భర్త. దీనికి ఆమె నిరాకరించడంతో బెదిరించాలని ఉరేసుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు బాగలగుంటెలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన అమిత్‌కుమార్ సాహ (28) దాసరహళ్లిలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం హసన్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదువు నిమిత్తం భార్యను నర్సింగ్ కోర్సులో చేర్చాడు. ఆమె నిరంతరం ఫోన్లో స్నేహితులతో మాట్లాడుతూ తనను పట్టించుకోకపోవడంతో భార్యతో గొడపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో గురువారం అమిత్ భార్యకు వీడియో కాల్ చేసి ఇంటికి రావాలని బతిమాలాడు. రాకపోతే ఉరి వేసుకొని చనిపోతానని బెదిరించాడు. ఇంతలో చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడటంతో పాటు గొంతుకు ఉరి బిగిసి మృత్యువాత పడ్డాడు.
జిమ్ చేస్తూ కుప్పకూలి 17 ఏళ్ల మైనర్ కన్నుమూత
జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం తరువాత ఆరోగ్యం ఉన్నవారు వ్యాయామం చేస్తూ పలు ఆకస్మిక మరణాలు ఆందోళన రేపుతున్నాయి. జిమ్‌లో వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల బాలుడు మరణించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్పూర్లోఈ విషాదం చోటు చేసుకుంది. భాన్‌పురిలోని స్పేస్ జిమ్‌లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రోజు మాదిరిగానే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల సమాచారం ప్రకారం సత్యం (17) రహంగ్‌డేల్ భన్‌పురిలోని ధనలక్ష్మి నగర్లో నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతున్న అతడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపో యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. అయితే అతని మరణానికి గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడిరచలేదు. పోస్టుమార్టం నివేదిక తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.సత్యం తండ్రి సుభాష్ రహంగ్‌డేల్ చిరు వ్యాపారం చేసుకునేవాడు. ఇద్దరు కుమారుల్లో సత్యం పెద్దవాడు. ఇటీవల ధనలక్ష్మి నగర్‌లోని కృష్ణ ఇంగ్లీషు మీడియం స్కూల్లో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఈ సంతోషం వారికి ఎంతోకాలం నిలవలేదు. ఎదిగిన కొడుకు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
పోలీసు కాల్పుల్లో రౌడీ షీటర్ మృతి
దొడ్డబళ్లాపురం: హత్యకేసులో నిందితుడైన రౌడీ షీటర్ పోలసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈఘటన దొడ్డ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడు రౌడీషీటర్ నరసింహమూర్తి ఈనెల 10వ తేదీన హేమంత్ గౌడ అనే యువకుడిని చర్చలకు పిలిచాడు. అనంతరం అనుచరులతో కలిసి మారణాయుధాలతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఆ రోజు రాత్రి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం దొడ్డ పట్టణ శివారులో ఒక చోట నిందితుడు నరసింహమూర్తి దాక్కున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే నిందితుడు పోలీసులపై దాడికి యతి్నంచాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ నరసింహమమూర్తికి తగలడంతో మృతి చెందాడు. కేసు దర్యాపులో ఉంది.
ప్రేమించి పెళ్లాడి.. ఆత్మహత్య
సాక్షి బళ్లారి/ హుబ్లీ: ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్న నవ దంపతులు ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ విధి మరోలా తలచింది. అంతు తెలియని సమస్యలతో ఆ జంట ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విజయపురలో చోటు చేసుకుంది. వివరాలు.. విజయపుర నగరంలోని సిద్దేశ్వర బడావణెలో నివాసం ఉంటున్న మనోజ్‌కుమార్ పోలా (30), రాఖీ (23) అనే యువతీ యువకులు ప్రేమలో పడ్డారు. నాలుగు నెలల క్రితం పెద్దలను కాదని గుడిలో పెళ్లి చేసుకొన్నారు. మనోజ్ తల్లి ఇంట్లోనే ఇద్దరూ కాపురం పెట్టారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని మంగళవారం రాత్రి ఇద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మనోజ్‌కుమార్ తల్లి ఊరికి వెళ్లి బుధవారం ఉదయమే తిరిగి రాగా ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటనపై జలనగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలే కారణం కావచ్చని స్థానికులు తెలిపారు.