దెయ్యాన్ని ప్రేమించిన హీరో.. లవ్‌ మీ ట్రైలర్‌ చూశారా? | Ashish, Vaishnavi Chaitanya Love Me Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Love Me Movie: దెయ్యంతో హీరో ప్రేమ కథ.. ట్రైలర్‌ వచ్చేసింది

Published Thu, May 16 2024 6:01 PM | Last Updated on Thu, May 16 2024 6:44 PM

Ashish, Vaishnavi Chaitanya Love Me Movie Trailer Released

దెయ్యంతో ప్రేమ.. కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది కదూ..! ఈ కాన్సెప్ట్‌తో వస్తోన్న క ఒత్త మూవీ లవ్‌ మీ. ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ గురువారం (మే 16న) రిలీజైంది. రోజూ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు ఒక అలారం మోగుతుంది. 

రాత్రి 8 గంటలకు..
ఆ సమయానికి ఎవరు ఏ పనిలో ఉన్నా అందరూ టంచనుగా ఆ టైంకు ఇంటి తలుపును మూసేస్తారు. కానీ ఓ ఆడపిల్ల మాత్రం గది తలుపు తెరిచి చూసి కెవ్వుమని అరుస్తుంది. ఆ వెంటనే హీరో ఇంట్రడక్షన్‌ వేశారు. ఎవరైనా ఏదైనా పని చేయొద్దు అంటే అదే చేయాలనిపిస్తుంది. అక్కడ డేంజర్‌ వెళ్లొద్దు అంటే అటే వెళ్లాలనిపిస్తుందంటూ తన స్వభావాన్ని ట్రైలర్‌లో చూపించాడు. 

దెయ్యంతో లవ్‌
అందుకే అందరూ భయపడే దెయ్యంతో ప్రేమలో పడతాడు. దెయ్యం చంపుతుందని అందరూ హెచ్చరించినా హీరో మాత్రం ఆ ఘోస్ట్‌ ప్లేస్‌లోకి వెళ్తాడు. చివరికి ఆ దెయ్యం అర్జున్‌ పీక పట్టుకోవడంతో ట్రైలర్‌ ముగుస్తుంది. మరి ఈ మనిషి-దెయ్యం ప్రేమకథ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మే 25 వరకు ఆగాల్సిందే! 

మే 25న రిలీజ్‌
అంటే సరిగ్గా మరో తొమ్మిది రోజుల్లో ప్రేక్షకులను భయపెట్టేందుకు లవ్‌ మీ థియేర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించగా ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించాడు. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు.

 

చదవండి: అలా జరిగుంటే నా పవిత్ర బతికేది, మా రిలేషన్‌ను చెప్దామనుకున్నాం.. ఏడ్చేసిన నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement