మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా? | Public notice is issued for public opinion on power sector decisions: ts | Sakshi
Sakshi News home page

మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?

May 17 2024 4:59 AM | Updated on May 17 2024 4:59 AM

Public notice is issued for public opinion on power sector decisions: ts

విద్యుత్‌రంగ నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణకు బహిరంగ ప్రకటన జారీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం (గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌) బిడ్డింగ్‌ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందం కుదుర్చుకోవడం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టడంతో రాష్ట్రానికి నష్టం వాటిల్లిందంటూ వచ్చిన ఆరోపణలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ మంగళవారం బహిరంగ ప్రకటన జారీ చేసింది. సంబంధిత అంశాల్లో అవగాహన, అనుభవం, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సంస్థలు 10 రోజుల్లోగా లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది.

 cio2024.power@gmail.com కి మెయిల్‌ ద్వారా లేదా తమ కార్యాలయానికి (7వ అంతస్తు, బీఆర్‌కేఆర్‌ భవన్, ఆదర్శ్‌ నగర్, హైదరాబాద్‌– 500004) పోస్టు ద్వారా పంపాలని సూచించింది. విచారణ కమిషన్‌కు పంపించే విజ్ఞాపనల్లో వ్యక్తులపై ఎలాంటి రాజకీయపరమైన ఆరోపణలు చేయరాదని కోరింది. ఎవరైనా కమిషన్‌ ముందు హాజరై మౌఖికంగా ఆధారాలు సమరి్పంచాలని భావిస్తే, ఏ విషయంలో వారు హాజరుకావాలని కోరుకుంటున్నారో తెలియజేయాలంది. సంబంధిత నిర్ణయాల్లో తప్పులను గుర్తించడంతోపాటు రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని నిర్ధారించడం, బాధ్యులను గుర్తించడం కోసం న్యాయవిచారణ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement