పోలీసు కాల్పుల్లో రౌడీ షీటర్ మృతి | Rowdy Sheeter died in police firing | Sakshi
Sakshi News home page

పోలీసు కాల్పుల్లో రౌడీ షీటర్ మృతి

May 16 2024 12:24 PM | Updated on May 16 2024 12:24 PM

Rowdy Sheeter died in police firing

దొడ్డబళ్లాపురం: హత్యకేసులో నిందితుడైన రౌడీ షీటర్ పోలసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈఘటన  దొడ్డ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడు రౌడీషీటర్‌ నరసింహమూర్తి ఈనెల 10వ తేదీన హేమంత్‌ గౌడ అనే యువకుడిని చర్చలకు పిలిచాడు. అనంతరం అనుచరులతో కలిసి మారణాయుధాలతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఆ రోజు రాత్రి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. 

ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం దొడ్డ పట్టణ శివారులో ఒక చోట నిందితుడు నరసింహమూర్తి దాక్కున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.   పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే నిందితుడు పోలీసులపై దాడికి యతి్నంచాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్‌ నరసింహమమూర్తికి తగలడంతో మృతి చెందాడు. కేసు దర్యాపులో ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement