రామ భక్త జయ హనుమా..
హాజరైన దేశ, విదేశీ భక్తులు, కాషాయ జెండాలతో ఉత్సాహం
మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్న గణపతి సచ్చిదానంద స్వామి
మైసూరులో ఓ శివాలయంలో
శివరాత్రికి సన్నాహాలు
మైసూరు: నగరంలోని మహారాజ కాలేజీ మైదానంలో అవదూత దత్తపీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృహత్ సామూహిక శ్రీహనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం భక్తిశ్రద్ధలతో జరిగింది. గణపతి సచ్చిదానంద స్వామీజీ నేతృత్వంలో జరిగిన ఆధ్యాత్మిక వేడుకలో 50 వేల మందికిపైగా హనుమ భక్తులు పాల్గొన్నారు. మొదట పవమాన హోమానికి పూర్ణాహుతి అర్పించారు. ఎమ్మెల్యేలు శ్రీవత్స, కే.హరీష్‌గౌడ, జీటీ దేవెగౌడ, నగర ప్రముఖులు పాల్గొన్నారు. రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కీ అనే నినాదంతో గణపతి సచ్చిదానంద స్వామి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుందరకాండ పారాయణం 2 గంటల పాటు నిరంతరంగా సాగింది. ఈ అవధిలో మొత్తం 18 సార్లు హనుమాన్ చాలీసాను పఠించారు.
కేసరిమయం
భక్తుల చేతుల్లో కేసరి ధ్వజాలు రెపరెపలాడాయి. మైదానం నిండా కేసరి రంగులో జెండాలు కనిపించాయి. ఎటు చూసినా హనుమ భక్తుల దండు కనిపించింది. హనుమ భక్తులు తరలి వచ్చారు. భక్తులనుద్దేశించి దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆశీర్వచనం చేశారు.
మైసూరు దత్తపీఠంలో
హనుమాన్ చాలీసా పారాయణం
వేలాదిగా పాల్గొన్న భక్తులు
రామ భక్త జయ హనుమా..
రామ భక్త జయ హనుమా..


