సాత్విక్‌–చిరాగ్‌ జోడీ శుభారంభం! | Satwik Sairaj And Chirag Shetty Pair Selected For Pre-Quarter Final In Badminton Doubles | Sakshi
Sakshi News home page

సాత్విక్‌–చిరాగ్‌ జోడీ శుభారంభం!

May 16 2024 9:36 AM | Updated on May 16 2024 9:44 AM

Satwik Sairaj And Chirag Shetty Pair Selected For Pre-Quarter Final In Badminton Doubles

ప్రణయ్‌పై మిరాబా సంచలన విజయం

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–13, 21–13తో నూర్‌ మొహమ్మద్‌–తాన్‌ వీ కియోంగ్‌ (మలేసియా) జంటపై విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. భారత రైజింగ్‌ స్టార్, ప్రపంచ 84వ ర్యాంకర్‌ మైస్నం మిరాబా లువాంగ్‌ వరుస గేముల్లో ప్రణయ్‌ను ఓడించి తన కెరీర్‌లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు.

55 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో మిరాబా 21–19, 21–18తో ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్‌కే చెందిన కిరణ్‌ జార్జి, సతీశ్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. కిరణ్‌ 15–21, 21–13, 17–21తో మాడ్స్‌ క్రిస్టోఫర్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో... సతీశ్‌ 13–21, 17–21తో జేసన్‌ గుణవన్‌ (హాంకాంగ్‌) చేతిలో పరాజయం పాలయ్యారు.

అష్మిత మినహా...
మహిళల సింగిల్స్‌లో భారత్‌ నుంచి ఐదుగురు బరిలోకి దిగగా... అష్మిత మినహా మిగతా నలుగురు ఉన్నతి హుడా, సామియా, మాళవిక, ఆకర్షి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. అష్మిత 19–21, 21–15, 21–14తో ఎస్తర్‌ నురిమి (ఇండోనేసియా) పై గెలిచింది. ఉన్నతి 21–14, 14–21, 19–21తో లియాన్‌ టాన్‌ (బెల్జియం) చేతిలో, సామియా 13–21, 13–21తో గావో ఫాంగ్‌ జి (చైనా) చేతిలో ... మాళవిక 11–21, 10–21తో హాన్‌ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 13–21, 8–21తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమి పాలయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement