క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ | Satwik and Chirag pair in the quarter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

May 17 2024 4:24 AM | Updated on May 17 2024 4:24 AM

Satwik and Chirag pair in the quarter final

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబు ల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం మరో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 21–16, 21–11తో జి సావో నాన్‌–జెంగ్‌ వె హాన్‌ (చైనీస్‌ తైపీ) జంటను ఓడించి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత రైజింగ్‌ స్టార్‌ మైస్నం మిరాబా లువాంగ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఈ మణిపూర్‌ ఆటగాడు 21–14, 22–20తో మాడ్స్‌ క్రిస్టోఫెర్సన్‌ (డెన్మార్క్‌)పై గెలుపొందాడు. మహిళల డబుల్స్‌ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్‌) జోడీ కూడా క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. 

తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన అశ్విని–తనీషా ద్వయం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 21–19, 21–17తో హంగ్‌ ఎన్‌ జు–లిన్‌ యు పె (చైనీస్‌ తైపీ) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అష్మిత (భారత్‌) 15–21, 21–12, 12–21తో హాన్‌ యువె (చైనా) చేతిలో ఓడిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement