నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ | Sakshi
Sakshi News home page

Renu Desai: 'ప్రతిసారీ నేనే ఇవ్వలేను.. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా'

Published Wed, May 15 2024 7:16 PM

Renu Desai Video Goes Viral In Social Media

గతేడాది రవితేజ నటించిన టైగర్‌ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. గుంటూరులోని స్టువర్టుపురం గజదొంగ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‍అసలేం జరిగిందో తెలుసుకుందాం.

రేణు దేశాయ్‌ తన ఇన్‌స్టాలో క్యూఆర్‌ కోడ్‌ను షేర్ చేస్తూ విరాళాలు కావాలంటూ అభ్యర్థించింది. అయితే ఇంత త్వరగా స్పందించి విరాళం అందించి.. మానవత్వం చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. నా వంతుగా నేను కూడా సాయం చేస్తున్నప్పటికీ.. మిగిలిన అమౌంట్‌ కోసం నా ఫాలోవర్స్‌ను అడుగున్నానని రాసుకొచ్చింది. ప్రతిసారీ నా డబ్బును ఇవ్వలేను.. ఎందుకంటే నా దగ్గర కూడా కొంత మాత్రమే డబ్బులు మిగిలి ఉన్నాయని పేర్కొంది. అయితే ఎవరైనా ఆమె అకౌంట్‌ను హ్యాక్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది.

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'ఫుడ్ పాయిజన్ తో కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు. అందుకే వీడియో చేయలేదు. అయితే రూ.3500 కోసం రిక్వెస్ట్‌ పెట్టింది నేనే. నా అకౌంట్‌ను ఎవరూ హ్యాక్‌ చేయలేదు. నేను కూడా రెగ్యులర్‌గా డొనేట్‌ చేస్తూనే ఉంటాను. కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది. డొనేషన్స్‌కి నా డబ్బులంతా ఇచ్చేస్తే నాకోసం.. నా పిల్లల కోసం కావాలి కదా. నా వరకు సాయం చేశాక.. ఏదైనా బ్యాలెన్స్‌ కావాలంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నా. యానిమల్స్‌, చిన్నపిల్లల కోసం కూడా నేను విరాళాలు ఇస్తున్నా. అదే నా ఫైనల్‌ టార్గెట్‌ కూడా. త్వరలోనే వాటికోసం ఓ షెల్టర్‌ కూడా నిర్మిస్తాను. అప్పుడు నేనే మిమ్మల్ని అధికారికంగా విరాళాలు సేకరిస్తా. నా రిక్సెస్ట్‌కు స్పందించి రూ.3500 పంపించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ' అంటూ పోస్ట్ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement