
సాక్షి బళ్లారి/ హుబ్లీ: ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్న నవ దంపతులు ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ విధి మరోలా తలచింది. అంతు తెలియని సమస్యలతో ఆ జంట ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విజయపురలో చోటు చేసుకుంది.
వివరాలు.. విజయపుర నగరంలోని సిద్దేశ్వర బడావణెలో నివాసం ఉంటున్న మనోజ్‌కుమార్ పోలా (30), రాఖీ (23) అనే యువతీ యువకులు ప్రేమలో పడ్డారు.
నాలుగు నెలల క్రితం పెద్దలను కాదని గుడిలో పెళ్లి చేసుకొన్నారు. మనోజ్ తల్లి ఇంట్లోనే ఇద్దరూ కాపురం పెట్టారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని మంగళవారం రాత్రి ఇద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మనోజ్‌కుమార్ తల్లి ఊరికి వెళ్లి బుధవారం ఉదయమే తిరిగి రాగా ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటనపై జలనగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలే కారణం కావచ్చని స్థానికులు తెలిపారు.