ప్రపంచ ఫిల్మ్‌ మేకర్స్‌ను ఏకం చేసే వేదిక ఇది | Sakshi
Sakshi News home page

ప్రపంచ ఫిల్మ్‌ మేకర్స్‌ను ఏకం చేసే వేదిక ఇది

Published Fri, May 17 2024 6:04 AM

Bharat Pavilion at The 77th Cannes Film Festival inaugurated

కాన్స్‌ చిత్రోత్సవాల్లో భారత రాయబారి జావేద్‌ అష్రఫ్‌ 

కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘భారత్‌ పర్వ్‌’ వేడుకలను తొలిసారిగా నిర్వర్తిస్తోంది భారత ప్రభుత్వం. ఈ వేడుకల్లో భాగంగానే ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘భారత్‌ పెవిలియన్‌’ను ‘ఫ్రాన్స్‌లోని భారత రాయబారి’ జావేద్‌ అష్రఫ్, ఎమ్‌ఐబీ (మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ) సెక్రటరీ సంజయ్‌ జాజు ్రపారంభించారు. తొలుత ఈ పెవిలియన్‌కు ‘ఇండియన్‌ పెవిలియన్‌’ పేరు అనుకున్నారట. ఆ తర్వాత ఈ పేరును ‘భారత్‌ పెవిలియన్‌’గా మార్చారు.

భారత్‌ పెవిలియన్‌ ్రపారంభం సందర్భంగా... ‘‘ఆల్‌ ఉయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ సినిమాతో మళ్లీ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌పోటీలో నిలిచినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సంజయ్‌. ‘‘కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అంటే కేవలం ఫ్యాషన్, రెడ్‌ కార్పెట్‌ మాత్రమే కాదు.. వరల్డ్‌ సినిమా ఫిల్మ్‌ మేకర్స్‌ను ఏకం చేస్తుంది. భవిష్యత్‌ ఫిల్మ్‌ మేకింగ్‌కు ఓ వేదిక అవుతుంది’’ అని పేర్కొన్నారు జావేద్‌ అష్రఫ్‌. ఈ కార్యక్రమంలో కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ డిప్యూటీ ఆర్టిస్టిక్‌ డైరెక్టర్‌ క్రిస్టియన్‌ జ్యూన్, ఇండియన్‌–కెనడియన్‌ ఫిల్మ్‌మేకర్‌ రిచీ మెహతా పాల్గొన్నారు. 

చేతికి ఏమైంది?... కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు రెండు దశాబ్దాలుగా తప్పకుండా హాజరవుతున్నారు ఐశ్వర్యా రాయ్‌. ఈ ఏడాది చిత్రోత్సవాల్లోనూ ఆమె మెరవనున్నారు. ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య ఫ్రాన్స్‌ చేరుకున్నారు. తొలిసారిగా ఐశ్వర్యా రాయ్‌ 2002 కాన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌పై నడిచిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే తల్లి ఐశ్వర్యతో కలిసి 2012లో ఆరాధ్య తొలిసారి కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మెరిసింది. తాజాగా తన కుమార్తెతో కలిసి ఐశ్వర్య కాన్స్‌ చిత్రోత్సవాలకు వెళ్లిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఆ ఫొటోలను గమనిస్తే.. ఆమె చేతికి కట్టు కట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దాంతో ఆమెకు ఏమైంది? గాయంతో ఐశ్వర్యా రాయ్‌ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌పై ఎలాంటి కాస్ట్యూమ్‌లో కనిపించనున్నారు? అనే ఆసక్తి నెలకొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement