త్రినయని సీరియల్ నటి పవిత్ర గౌడ రెండు రోజుల క్రితం మరణించింది. అయితే తను యాక్సిడెంట్‌లో మరణించలేదంటున్నాడు నటుడు చంద్రకాంత్. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పవిత్ర గురించి చెప్తూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. 'కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు మేమంతా బెంగళూరు వెళ్లాం. అక్కడ ప్రాజెక్టుకు ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకుని హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యాము.
నటికి గాయాలవలేదు!
కారులో నేను, పవిత్ర వెనకాల కూర్చున్నాం. ముందు డ్రైవర్ పక్కన పవిత్ర సోదరి కూతురు ఉంది. అందరమూ గాఢ నిద్రలో ఉన్నాం. బస్ మమ్మల్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో మా కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. అప్పుడు నా ఒక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. పవిత్రకు ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. నన్ను రక్తపు మడుగులో చూసేసరికి నాన్నా ఏమైందంటూ షాక్‌లోకి వెళ్లిపోయింది. అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే తను మరణించింది. అంబులెన్స్ సమయానికి వచ్చుంటే తను బతికేది. గుండెపోటు వల్లే తన ఊపిరి ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు.
ఇంతలోనే..
మేము భార్యాభర్తలమన్న విషయాన్ని అధికారికంగా చెప్దామనుకున్నాము. ఇంతలోనే తను నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. నా జీవితం ఎటు కాకుండా పోయింది. ఆ దేవుడు తనను అలాగే ఉంచి నన్ను తీసుకెళ్లినా బాగుండేది. నా పవిత్ర గురించి తప్పుడుగా ప్రచారం చేయకండి.. అది చాలా మంచి మనిషి' అని చంద్రకాంత్ కన్నీరుమున్నీరుగా విలపించాడు.
Comments
Please login to add a commentAdd a comment