యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లారీ చాప్టర్‌-1.. ఆసక్తిగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్! | Tollywood Movie Lorry Chapter one Movie First Look Poster Out | Sakshi
Sakshi News home page

Lorry Chapter one: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లారీ చాప్టర్‌-1.. ఆసక్తిగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్!

May 16 2024 10:01 PM | Updated on May 16 2024 10:01 PM

Tollywood Movie Lorry Chapter one Movie First Look Poster Out

శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం "లారి చాప్టర్ -1". యూట్యూబ్‌లో తన వీడియోలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీకాంత్‌ రెడ్డి  హీరోగా వెండి తెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చంధ్ర శిఖ నటించనుండగా.. రాఖీ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై  ఆసం వెంకట లక్ష్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ సందర్భంగా  శ్రీకాంత్ రెడ్డి ఆసం మాట్లాడుతూ..'చెన్నై లయోల కాలేజీలో డైరెక్షన్ కోర్స్ చేసిన మొదట యూట్యూబ్‌లో నా కెరీర్ ప్రారంభించాను. మంచి పాపులారిటీ వచ్చింది. అలాగే చాలా సినిమాలకు వివిధ శాఖలలో పని చేశాను. ఇప్పుడు "లారి చాప్టర్ -1" అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నా. ఇది ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషలో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నా. నా మొదటి సినిమా అందరికీ నచ్చుతుంది"' అని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement