ఆమెతో బ్రేకప్‌కు కారణం అదే.. హీరామండి నటుడు! | Sakshi
Sakshi News home page

Heeramandi: నటితో బ్రేకప్‌.. అసలు కారణం అదేనన్న నటుడు!

Published Thu, May 16 2024 8:00 PM

Heeramandi Actor Jason Shah On Breakup With Anusha Dandekar

బాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్ తెరకెక్కించిన హిస్టారికల్‌  వెబ్ సిరీస్‌ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ నెల 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్‌ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. పాక్‌లోని లాహోర్‌లో స్వాతంత్య్రానికి ముందు జరిగిన చారిత్రాత్మక కథనంతో ఈ సిరీస్‌ను తీసుకొచ్చారు. హీరామండి ప్రాంతంలో ఉండే వేశ్యల ఇతివృత్తమే ప్రధానంగా చూపించారు.

అయితే ఈ సిరీస్‌లో బ్రిటీష్ పోలీస్ అధికారి పాత్రలో మెప్పించిన నటుడు జాసన్‌ షా. ఈ వెబ్ సిరీస్‌లో  కార్ట్‌రైట్ పాత్రలో మెప్పించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ షా.. నటి అనూషా దండేకర్‌తో బ్రేకప్‌ గురించి మాట్లాడారు. ఆమెతో విడిపోవడానికి గల కారణాలను జాసన్‌ షా పంచుకున్నారు. 

అనూషతో విడిపోవడం పెద్ద ఆధ్యాత్మిక మార్పునకు దారితీసిందని జాసన్ చెప్పుకొచ్చారు. ఆమె తనను  సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. నన్ను తన నియంత్రణలో పెట్టుకునేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. అది జరగని పని కావడంతో విడిపోవాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒకరి మాట మరొకరు వినకపోవడమే బ్రేకప్‌కు కారణమని జాసన్ షా తెలిపారు. అవతలి వ్యక్తి చెప్పేది.. మీరు వింటే మీ రిలేషన్‌ ఎక్కువ కాలం ఉంటుందని సూచించారు. తనను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే తమ బంధం విచ్ఛిన్నానికి కారణమని తెలిపారు. కాగా.. హీరామండి కంటే ముందు జాన్సీకి రాణి, బిగ్ బాస్ వంటి టీవీ షోలలో జాసన్ కనిపించాడు. అతను 2021లో అనూషా దండేకర్‌తో విడిపోయారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement