బేబీ హీరోయిన్‌ ఫోన్ కాల్.. 'లవ్‌ మీ' చెప్పాలంటూ హీరోను! | Baby Actress Vaishnavi Chaitanya Prank Call To Tollywood Hero | Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: హీరోకు ఫోన్.. అందరిముందే లవ్‌ మీ అంటూ!

May 16 2024 7:05 PM | Updated on May 16 2024 8:04 PM

Baby Actress Vaishnavi Chaitanya Prank Call To Tollywood Hero

బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య టాలీవుడ్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆ సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఆనంద్‌ దేవరకొండ, విరాజ్ అశ్విన్‌ నటించిన బేబీ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సాయి రాజేశ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది.

అయితే ఈ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య ప్రస్తుతం లవ్‌ మీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆశిష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.

అయితే ఈ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై ఉండగానే ఆనంద్ దేవరకొండకు ఫోన్‌ చేసింది వైష్ణవి. ఫోన్‌లోనే తనకు 'లవ్‌ మీ.. ఇఫ్‌ యూ డేర్‌' చెప్పాలని వైష్ణవి కోరింది. అయితే దీనికి షాక్ అయిన ఆనంద్ నేనే చెప్పాలా? అని అడిగారు. బేబీ సినిమా మొత్తం చూసినా కదా.. అవన్నీ చెబితే బాగోదేమో అంటూ ఫన్నీగా ఆన్సరిచ్చారు. ఆ పదాన్ని రిపీట్‌ చేయాలని మళ్లీ కోరింది వైష్ణవి చైతన్య. దీంతో చివరికీ 'లవ్ మీ.. ఇఫ్‌ యూ డేర్‌' అంటూ చెప్పేశారు. దీంతో ‍అక్కడున్న వారంతా కేకలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. లవ్ మీ మూవీ ఈ నెల 25న రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement