పుంజుకున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

పుంజుకున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

May 16 2024 3:31 PM | Updated on May 16 2024 3:31 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 194 పాయింట్లు లాభపడి 22,394 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 649 పాయింట్లు పుంజుకుని 73,636 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎం అండ్‌ ఎం, టెక్‌ మహీంద్రా, భారతీఎయిర్‌ఎల్‌, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, నెస్లే కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement