న‌న్ను భ‌య‌పెట్టిన బౌల‌ర్ అత‌డే: రోహిత్ శ‌ర్మ‌ | Rohit Sharma reveals toughest bowler he faced | Sakshi
Sakshi News home page

న‌న్ను భ‌య‌పెట్టిన బౌల‌ర్ అత‌డే: రోహిత్ శ‌ర్మ‌

May 16 2024 6:39 PM | Updated on May 16 2024 7:07 PM

Rohit Sharma reveals toughest bowler he faced

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ముందు వ‌రుస‌లో ఉంటాడ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. వ‌ర‌ల్డ్‌క్లాస్ బౌల‌ర్ల‌ను సైతం భ‌య‌పెట్టిన ఘ‌న‌త హిట్‌మ్యాన్‌ది. 

వ‌న్డే క్రికెట్‌లో రెండు సార్లు డబుల్ సెంచ‌రీ బాదిన ఏకైక మొన‌గాడు రోహిత్ శ‌ర్మనే. అటువంటి రోహిత్ శ‌ర్మ త‌న కెరీర్‌లో ఒక బౌల‌ర్‌కు భ‌య‌ప‌డ్డాడ‌ట‌. అత‌డే ద‌క్షిణాఫ్రికా పేస్ దిగ్గ‌జం డేల్ స్టెయిన్‌. 

రోహిత్ శ‌ర్మ తాజాగా దుబాయ్ ఐ 103.8 అనే ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో త‌న కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత క‌ఠిన‌మైన బౌల‌ర్ ఎవ‌ర‌న్న ప్ర‌శ్న హిట్‌మ్యాన్‌కు ఎదురైంది. అందుకు బ‌దులుగా రోహిత్ శ‌ర్మ‌.. డేల్ స్టెయిన్ అంటూ బ‌దులిచ్చాడు.

"నేను నా కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత క‌ఠిన‌మైన బౌల‌ర్ డేల్ స్టేయిన్‌. స్టేయిన్ ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టులో ఉంటే నేను బ్యాటింగ్‌కు వెళ్లే ముందు అత‌డి బౌలింగ్ వీడియోలను 100 సార్లు చూసేవాడిని. స్టెయిన్ అద్భుత‌మైన బౌల‌ర్‌. అత‌డొక లెజెండ్‌. అత‌డు బంతిని అద్భుతంగా స్వింగ్ చేయ‌గ‌ల‌డు. అతడి బౌలింగ్‌లో ఆడటాన్ని ఆస్వాదిస్తాన‌ని"  రోహిత్ పేర్కొన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement