విరాట్ కోహ్లి (PC: RCB X)
‘‘క్రీడాకారులుగా మన కెరీర్‌కు కచ్చితంగా ఆఖరి తేదీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి నేను నా ఆటలో లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడంపైనే ఎల్లప్పుడూ దృష్టి సారిస్తాను.
కెరీర్ ముగిసి పోయిన తర్వాత.. ‘ఓహ్.. ఆరోజు నేను అలా చేస్తే బాగుండు.. ఇలా చేస్తే ఇంకా మెరుగ్గా ఉండేది’ అని పశ్చాత్తాపపడాలని అనుకోవడం లేదు. కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఎల్లకాలం గతం గురించే ఆలోచిస్తూ కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ప్రతీ పని ఇప్పుడే పూర్తి చేసుకుంటాను.
పశ్చాత్తాపపడేందుకు ఏదీ మిగలనివ్వను. కచ్చితంగా నేను ఇది సాధిస్తాననే అనుకుంటున్నా’’ అంటూ టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.
మీ కంటికి కూడా కనిపించను
ఆర్సీబీ రాయల్ గాలా డిన్నర్ నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత తాను చేయాలనుకుంటున్న పనుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మీ కంటికి కూడా కనిపించను(నవ్వుతూ).
అందుకే ఇక్కడ ఉన్నంతసేపు నా శాయశక్తులా, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తపిస్తున్నా. ఆ తపనే నన్ను ఇప్పుడు ముందుకు నడిపిస్తోంది’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా 2008లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లి జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.
రికార్డుల రారాజుగా పేరొంది కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
అత్యధిక పరుగుల వీరుడు
పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఒక్కసారి కూడా గాయాల బెడదతో కోహ్లి జట్టుకు దూరం కాలేదంటే ఫిట్‌నెస్ మీద అతడికి ఉన్న శ్రద్ధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక 35 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు.
ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లలో ఆడి 661 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి.. అత్యధిక పరుగుల వీరుడి(ఆరెంజ్ క్యాప్ హోల్డర్)గా కొనసాగుతున్నాడు.
లీగ్ దశలో ఆర్సీబీ తమ ఆఖరి మ్యాచ్‌లో మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ఆర్సీబీ ఇంటిబాట పడుతుంది. కాగా బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేదన్న సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment