చాపాడు : మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన ప్రొద్దుటూరు చెన్నయ్య (56) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. ఈనెల 6న రాజంపేటకు వెళ్లి వస్తానని చెప్పిన చెన్నయ్య తిరిగి ఇంటికి రాలేదన్నారు. ఈ క్రమంలో మంగళవారం కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మార్చురీలో
గుర్తు తెలియని మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కు గుర్తు తెలియని వ్యక్తి (50)ని వైద్యం కోసం తీసుకురాగానే పరీక్షలను నిర్వహించి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అతని ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఆన్‌లైన్ మట్కా బీటర్ అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : ఆన్‌లైన్‌లో మట్కా జూదం నిర్వహిస్తున్న వ్యక్తిని ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నడింపల్లె ప్రాంతానికి చెందిన షేక్ మహబూబ్‌బాషా ఆన్‌లైన్‌లో మట్కా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన వన్‌టౌన్ ఎస్‌ఐ మైనుద్ధిన్ మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.7 వేలు నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆన్‌లైన్‌లో మట్కా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్ సీఐ కొండారెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.


