నిండుగా పూసి.. నీలి రంగు తివాచీ పరిచినట్లు ఎంతో కనువిందు చేస్తున్న ఈ పూలను చూసి ఏదో అందమైన సరస్సు అనుకుంటే పొరపాటే! ఇది మన కేసీ కాలువలో మైదుకూరు వద్ద దట్టంగా అల్లుకుపోయిన గుర్రపు డెక్క మొక్కల విశ్వరూపం. కాలువలో పూడిక తీయకపోవడంతో ఇవి కాలువ పొడవునా పరుచుకుని ఇలా పూలు పూశాయి. ఎలాగూ నీళ్లు లేవు కదా అని అధికారులు వీటిని గాలికొదిలేశారు. కానీ, ఇప్పుడు తాగునీటి అవసరాల కోసం కాలువకు నీటిని విడుదల చేశారు. కాలువ కొండపేట చానల్‌లో కొండలా పేరుకుపోయిన ఈ గుర్రపు డెక్కల కారణంగా నీరు దిగువకు ప్రవహించడం కష్టంగా మారింది. చూసేందుకు అందంగా ఉన్నా.. లోతట్టు ప్రాంతాల ప్రజల దాహార్తికి ఇవి పెద్ద గండంగా మారాయని ప్రజలు వాపోతున్నారు. – మైదుకూరు


