
పులివెందులలో విష సంస్కృతికి బీజం
సాక్షి టాస్క్‌ఫోర్స్: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో విష సంస్కృతికి బీజం పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నిక జరిగింది. వేలాది మంది టీడీపీ అల్లరి మూకలవల్ల ఓటర్లు, ఏజెంట్లు భయబ్రాంతులకు గురయ్యారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లి పోలింగ్ బూత్‌లను మంగళవారం టీడీపీ మూకలు ఆక్రమించుకున్నారు. అలాగే టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ సాక్షి వాహనాన్ని చుట్టుముట్టి వాహనాన్ని బాది తాళాలు లాక్కొన్నారు., చొక్కా పట్టి కిందకు దించే ప్రయత్నం చేశారు. కొత్తపల్లిలో ‘సాక్షి’ మీడియా వాహనాలు ధ్వంసం చేశారు. ఎర్రిపల్లె, కొత్తపల్లెల్లో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆనంద్‌పై టీడీపీ అల్లరి మూకల దాడి చేశారు. తుమ్మలపల్లె, కనంపల్లెలలో కట్టెలు పట్టుకుని టీడీపీ మూకలు గొడవలు చేశారు. తుమ్మలపల్లెలో షామియానా వేసి టిఫిన్, భోజనాలు ఏర్పాటు చేశారు. అచ్చివెళ్లిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను టీడీపీ నాయకులు అడ్డుకున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. మోట్నూతలపల్లెలో టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ వాహనాలను ధ్వంసం చేశారు. కొత్తపల్లె, నల్లగొండువారిపల్లె, తుమ్మలపల్లె పోలింగ్ బూత్‌లలోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించకుండా ఆక్రమించుకున్నారు. ఎర్రిపల్లెలో పోలింగ్ బూత్‌ను ఆధీనంలోకి తీసుకుని ప్రజలు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులను సైతం తరిమేస్తూ.. ఊర్లో మహిళలపై దాడి, అసభ్యంగా ప్రవర్తించారు. గ్రామంలో ఎవరూ ఓటు వేయకుండా అడ్డుకున్నారు.
పల్లెలపై పడ్డ పచ్చ మంద
భయబ్రాంతులకు గురైన ఓటర్లు
ఏజెంట్ల ఫారాలు చించివేత
టీడీపీ అల్లరి మూకల భయానక పరిస్థితుల మధ్య ఎన్నికలు
చోద్యం చూసిన పోలీసు యంత్రాంగం