
ఏపీలో శాంతిభద్రతలు లేవనడానికి.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా దాడులే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. సాక్షాత్తూ కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ అసలు దీనిని ఎన్నికంటారా? అని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఇవాళ(ఆగస్టు 13, 2025) జరిగిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.






















