ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించకోలేకపోవడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక తాలిబన్ల రాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ఎర్రిపల్లె గ్రామంలో 300 మంది టీడీపీ గూండాలు భయపెట్టారు. సోమవారం రాత్రి నుంచి గ్రామంలో తిరుగుతూ వైఎస్సార్‌సీపీకి చెందిన వారిని కత్తులు, తుపాకులతో బెదిరించారు. గ్రామంలో ఎవరినీ కూడా ఓటు వేసేందుకు వెళ్లనివ్వలేదు. స్లిప్పులు లాక్కొని మర్యాదగా వెళ్లిపోతారా.. లేక దెబ్బలు తింటారా అని హెచ్చరించారు. ఇలాంటి సంస్కృతి ఎన్నడూ చూడలేదు. –కె.రామ్మోహన్ రెడ్డి, ఎర్రిపల్లె, పులివెందుల మండలం
500 మంది టీడీపీ గూండాలు వచ్చారు
గ్రామంలోకి సోమవారం రాత్రి ఒకసారిగా 500 మంది టీడీపీ గూండాలు వచ్చారు. గ్రామంలో వీధి వీధి తిరిగారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. దీంతో వారు గ్రామంలో లేకుండా వెళ్లిపోయారు. ఏజెంట్లుగా ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బెదిరించారు. భయపడి గ్రామస్తులు ఎవరూ కూడా ఓటు వేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. పోలీసులు టీడీపీ గూండాలకు తొత్తులుగా వ్యవహరించడం తగదు. – జి.సుధాకర్ రెడ్డి,
ఎర్రిపల్లె, పులివెందుల మండలం
బీటెక్ రవి తమ్ముడు భరత్
అడ్డుకున్నాడు
ఎర్రిపల్లె పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చొనేందుకు వెళ్లాను. బీటెక్ రవి తమ్ముడు భరత్‌కుమార్‌రెడ్డి నా వద్ద ఉన్న పత్రాలు లాక్కొని అడ్డుకున్నాడు. ఇతనితో పాటు పోలీసులు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు. ఇలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించాలి? పోలీసులు వారి డ్యూటీ చేయకుండా టీడీపీ గూండాలకు కాపలాగా ఉన్నారు. గ్రామంలో ఏ ఒక్కరినీ ఓటు వేయనీయలేదు. – గంగా భవాని,
ఎర్రిపల్లె, పులివెందుల మండలం
వైఎస్సార్‌సీపీ అంటే
స్లిప్పులు లాక్కున్నారు
కొత్తపల్లె పోలింగ్ కేంద్రంలో ఏజెంట్‌గా నిలబడటానికి వెళితే ఏజెంట్ పత్రాలను చించివేశారు. ఓటు వేయడానికి వెళ్లిన వారిని ఏ పార్టీకి చెందిన వారని అడుగుతున్నారు. వైఎస్సార్‌సీపీ అంటే స్లిప్పులు లాక్కొని వెనక్కు పంపిస్తున్నారు. గ్రామంలో ఇదేవిధంగా ప్రజల స్లిప్పులను తీసుకుని వారే ఓటింగ్ వేసేలా చేసుకున్నారు. రిగ్గింగ్ పక్కాగా జరిగింది. ఇంటింటికి వెళ్లి బెదిరింపులతో ఓటర్ల స్లిప్పులను తీసుకెళ్లారు. – పి.సాయికుమార్,
చంద్రగిరి, పులివెందుల మండలం
న్యూస్‌రీల్
స్లిప్పులు లాక్కోవడం ఏంటి?
స్లిప్పులు లాక్కోవడం ఏంటి?
స్లిప్పులు లాక్కోవడం ఏంటి?