
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఎన్‌ఆర్‌ఐలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గల్ఫ్ దేశాలలోని ఎన్‌ఆర్‌ఐలు కలిశారు. మంగళవారం విజయవాడ తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ ఏ. సాంబశివ రెడ్డి ఆధ్వర్యంలో గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్‌తో కలిసి గల్ఫ్ అడ్వైజర్ నాయని మహేశ్వర్ రెడ్డి, కువైట్ కో కన్వీనర్ మన్నూర్ చంద్రశేఖర్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పులపుత్తూర్ సురేష్ కుమార్ రెడ్డి, అడ్వైజర్ అరవ సుబ్బారెడ్డి మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. ఏజెంట్లను లాగిపడేసి యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారన్నారు. రాజకీయ కక్షలతో వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారని, ఎంతో కాలం ఈ అక్రమాలు సాగవని హెచ్చరించారు.