
ఫ్రీ పోలింగ్ జరపాలి
పులివెందుల మండల జెడ్పీటీసీ ఎన్నికలు ఫ్రీ పోల్ గా జరపాలి. టీడీపీ గుండాలు పోలింగ్ బూతుల వద్ద కాపు కాయడం సరికాదు. గ్రామస్తుల ఓటర్ స్లిప్పులను చింపి వాళ్లే ఓటు వేసుకుంటున్నారు. ఇప్పటికై నా ఇలాంటి సంస్కృతి మానేస్తే బాగుంటుంది. అంతేకాకుండా అధికారులు మా గ్రామం నుంచి వేరే గ్రామానికి పోలింగ్ బూతులను మార్చడం సరైన పద్ధతి కాదు. మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.
– చందన, ఇ –కొత్తపల్లె (దళితవాడ) పులివెందుల
ఇలాంటి ఎన్నికలు
ఎప్పుడు జరగలేదు
ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. అందుకే మా కొత్తపల్లి దళితవాడలోని ఓటర్లందరం బాయ్ కాట్ చేస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి టీడీపీ గుండాలు బూతుల వద్దకు చేరుకున్నారు. బూతు దగ్గరికి వెళ్లగానే మా దగ్గర ఉన్న స్లిప్పులు లాక్కుంటున్నారు. మీరు వెళ్లిపోండి మీ ఓటు మేమే వేస్తాం అని అంటున్నారు. మా ఓటును కూడా మేము వేసుకునే పరిస్థితిలో లేం. ఇలాంటి సంస్కృతి కూటమి నేతలు మార్చుకోవాలి.
– గోవిందమ్మ, ఇ –కొత్తపల్లె, పులివెందుల
ఓటింగ్ బాయ్ కాట్
పులివెందుల మండలంలోని ఇ–కొత్తపల్లె దళితవాడ గ్రామస్తులందరం పోలింగ్‌కు వెళ్లకుండా బాయ్ కాట్ చేశాం. నేను పోలింగ్ బూత్ లో ఏజెంటుగా ఉన్నాను. కానీ పోలింగ్ బూత్ వద్ద ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ గుండాలు చుట్టూ ముట్టారు. నా దగ్గర ఉన్న ఏజెంట్ ఫారాన్ని లాక్కొని చింపి వేశారు. ఓటర్లు, ఏజెంట్లు వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నికలు ఎందుకు జరపాలి. మా ఓటును స్వేచ్ఛగా అధికారులు వేసుకోలేనప్పుడు ఎన్నికలను రద్దు చేయాలి.
– వరలక్ష్మి, మండలాధ్యక్షురాలు, ఇ –కొత్తపల్లె.

ఫ్రీ పోలింగ్ జరపాలి

ఫ్రీ పోలింగ్ జరపాలి