
కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
– కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : పటిష్టమైన భద్రతా బలగాల మధ్య కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి బుధవారం సాయంత్రం కడప రిమ్స్ సమీపంలోని మౌలా నా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జేసీ అదితి సింగ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లతో నిక్షిప్తమైన బ్యాలెట్ బాక్సులను అత్యంత సురక్షితంగా భద్రపరచామన్నారు. రౌండ్ల వారీగా కౌంటింగ్ సమాచారం కోసం మీడియా సెంటర్‌ను కుడా ఏర్పాటు చేశామన్నారు.
– పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 30 మంది సూపర్‌వైజర్లు 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు.