
వర్షానికి కూలిన పై కప్పు
కొండాపురం : నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వ ర్షానికి మండల పరిధిలోని బి.కొట్టాలపల్లె గ్రామానికి చెందిన ఆర్. హరికేశవరెడ్డి మట్టి మిద్దె ఇంటి కప్పు మంగ్లవారం రాత్రి కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం లేదా నూతన ఇళ్లు మంజూరు చేయాలని బాధితుడు కోరారు.
అధికారుల పరిశీలన
మైలవరం : మండల కేంద్రంలోని అయ్యవారిపల్లె గ్రామంలో వర్షానికి మిద్దె పైకప్పులు కూలిపోయాయి. బుధవారం ఉదయం తహసీల్దార్ లక్ష్మీనారాయణ సంఘటన స్థలాన్ని చేరుకుని మిద్దెను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు గంగబోయిన రవికుమార్, చౌడం వెంగళరావు తమ ఆవేదనను అధికారులకు విన్నవించారు. అనంతరం తహసీల్దార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.