
25 నుంచి ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్ : కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి వివిధ కోర్సుల్లో నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూటీ పార్లర్ (35 రోజులు), జ్యూట్ ప్రోడెక్ట్ (14 రోజులు), కొవ్వొత్తుల తయారీ (11 రోజులు)లో శిక్షణ ఉంటుందని వివరించారు. 18–45 ఏళ్లలోపు కలిగిన నిరుద్యోగ మహిళలు ఇందుకు అర్హులన్నారు. దూర ప్రాంతాల వారికి ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పిస్తామన్నారు. నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 94409 05478, 99856 06866, 94409 33028 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
డీఫార్మసీ కోర్సుకు
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ సైన్సు గ్రూపు(ఎంపీసీ/బైపీసీ) పాస్ అయిన విద్యా ర్థులు గవర్నమెంట్, ప్రైవేటు పాలిటెక్నిక్‌లో డి ఫార్మసీ (డిప్లొమా ఇన్ ఫార్మసీ) రెండేళ్ల కోర్సులో చేరేందుకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. ఈ నెల 19 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 6302782239, 9440144057 సంప్రదించాలని సూచించారు.
వైఎస్ జగన్‌ను కలిసిన సుబ్బారెడ్డి
ఒంటిమిట్ట : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని బుధవారం జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఒంటిమిట్టలో మంగళవారం జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి ఆయనతో చర్చించా రు. ఇంతటి ఘోరమైన ఎన్నికలు తమ జీవితంలో చూడలేదన్నారు. మండలంలో ఏర్పా టు చేసిన ప్రతి బూత్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమక్షంలో ఆయన మనుషులు రిగ్గింగ్ చేశారని తెలిపారు. ఇక్కడ జరిగిన దౌర్జన్యాలు, అక్రమాల గురించి మాజీ సీఎంకు వివరించారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వన్‌టైమ్ సెటిల్మెంట్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
కడప ఎడ్యుకేషన్ : పూర్వ విద్యార్థులకు సంబంధించి వన్ టైమ్ సెటిల్మెంట్ సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేశామని ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్రనాథ్ తెలిపారు. 2018, 2019, 2020, 2021,2022 సంవత్సరంలో తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు వన్‌ౖటైమ్ సెటిల్మెంట్ సప్లి మెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు. ఇందులో ప్రతి ఒక్క పేపర్‌కు రూ. 1000 చెల్లించాలని తెలిపారు. పరీక్ష ఫీజును ఈనెల 14 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ ఫీజును చలానా ద్వా రా చెల్లించాలని వివరించారు. విద్యార్థులకు ఏదైనా సందేహాలు ఉంటే ప్రభుత్వ పురుషుల కళాశాలోని పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.
నిత్యపూజ స్వామికి
రూ. 1,38,003 ఆదాయం
సిద్దవటం : వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల అడవుల్లో వెలసిన శ్రీ నిత్యపూజ స్వా మి హుండీ ఆదాయం లెక్కించారు. బుధవారం ఆలయ ఇన్‌చార్జి ఈఓ శ్రీధర్ మాట్లాడుతూ జూన్, జూలై నెలల్లో భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించగా రూ. 1,38,003 వచ్చిందని తెలిపారు. రాజంపేట దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ పాల్గొన్నారు.
‘పింఛా’లో పెరిగిన నీటిమట్టం
సుండుపల్లె : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పింఛా ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది.బుధవారం సాయంత్రానికి 258 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరగా ప్రస్తుతం 996.6 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో మొత్తం నీరు 81.74 శాతంగా ఉందని జలవనరుల శాఖ ఏఈఈ నాగేంద్రనాయక్ తెలిపారు. ఎస్‌ఐ ముత్యాల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదల కారణంగా ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని, ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తుతారని, అందువల్ల ప్రాజెక్టుకు దిగువ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.