ఎకరానికి రూ.50 లక్షలు ఇవ్వాల్సిందే | - | Sakshi
Sakshi News home page

ఎకరానికి రూ.50 లక్షలు ఇవ్వాల్సిందే

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

భువనగిరి: బునాదిగాని కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు ఎకరానికి రూ. 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని భువనగిరి సమీపంలోని తుక్కాపురం రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. భువనగిరి పట్టణానికి ఆనుకుని ఉన్న తమ గ్రామంలో బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఎకరం భూమి విలువ కోటి రూపాయల వరకు పలుకుతోందని, కాబట్టి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాథరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జనగాం పాండు, మాజీ సర్పంచ్‌ పుట్ట వీరేష్‌ యాదవ్‌, ఉప సర్పంచ్‌ రాసాల లింగస్వామి, మహేష్‌, మల్లయ్య, నర్సిరెడ్డి, శేఖర్‌రెడ్డి, జంగారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement