శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

నకిరేకల్‌ : సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగడం సరికాదని రాష్ట్ర పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల మధ్య కుల, మత వైషమ్యాలు పెరిగి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. శుక్రవారం నకిరేకల్‌లోని వినాయక ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కులం, మతానికి చెందిన వారు తమ అభివృద్ధి కోసం, హక్కుల కోసం పోరాడటం తప్పు కాదని, కానీ ఇతరులను కించపరుస్తూ మాట్లాడటం దేశ ఐక్యతకు, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో విద్వేషాలు సృష్టించే వారి పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజ్యా ంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలన్నారు. ఈ సమావేశంలో సమాచార హక్కు వ్యవస్థాపక అధ్యక్షుడు యర్రమాద కృష్ణారెడ్డి, ఎస్‌ఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement