రగ్బీ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన నల్లగొండ | - | Sakshi
Sakshi News home page

రగ్బీ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన నల్లగొండ

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ రగ్బీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని వోక్సెన్‌ యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అస్మితా రగ్బీ ఛాంపియన్‌షిప్‌–2026 విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో అండర్‌–15 విభాగంలో ఖమ్మం జట్టు విజేతగా నిలవగా, అండర్‌–18 విభాగంలో మెదక్‌ జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. నవంబర్‌ 4, 5 తేదీల్లో నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణలోని 17 జిల్లాల నుంచి 28 జట్లు అండర్‌–15, అండర్‌–18 బాలికల విభాగాల్లో పాల్గొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రగ్బీ క్రీడను విస్తరించి, కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు తమ కృషి కొనసాగుతుందని తెలంగాణ రగ్బీ అసోసియేషన్‌ పేర్కొంది.

తక్కువ నీటితో సాగయ్యే

పంటలు వేయాలి

● రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన

హుజూర్‌నగర్‌(గరిడేపల్లి) : ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో నీటి ఎద్దడిని తట్టుకుంటూ, తక్కువ నీటితో అధిక లాభాలు అందించే పంటలను రైతులు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చంద్రశేఖర్‌, శివప్రసాద్‌ సూచించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో.. హుజూర్‌నగర్‌ వ్యవసాయ కళాశాల, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శుక్రవారం గరిడేపల్లిలో రైతు పొలాల్లో ఆవిష్కరణలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పెసర, మినుము విత్తన కిట్లతో పాటు నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవుల మిశ్రమాన్ని పంపిణీ చేశారు. సూక్ష్మజీవుల వినియోగంతో యూరియా వాడకం తగ్గి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. పంట మార్పిడి ద్వారా కలుపు, చీడపీడల సమస్య తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గరిడేపల్లి ఏఓ ప్రియతమ్‌ కుమార్‌, ఏఈఓలు శిరీష, సంధ్య, రైతులు నలబోలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భార్యను హత్య చేసిన

భర్త అరెస్ట్‌

ముదిగొండ: కుటుంబ కలహాల కారణంగా భార్యను హతమార్చిన భర్తను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వివరాలు... ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరికి చెందిన పస్తం లక్ష్మయ్యకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన వెంకటమ్మ(35)తో వివాహం జరిగింది. వీరు గంధసిరిలో ఉంటుండగా.. గత నెల 20వ తేదీన ఆమె మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, కుటుంబ కలహాల కారణంగా వెంకటమ్మ తలపై భర్త లక్ష్మయ్య కర్రతో బాదడంతో ఆమె మృతి చెందిందని విచారణలో బయటపడింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని ముదిగొండ సీఐ మురళి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement