రామగిరి (నల్లగొండ): కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం (కిసాన్ సభ) మహాసభల సందర్భంగా, 15న నిర్వహించే భారీ బహిరంగ సభకు వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, శ్రామికులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నారి ఐలయ్య, కప్పుల లింగస్వామి, బొజ్జ చిన్న వెంకులు, గంధం మల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత వ్యవసాయ కార్మిక
సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్


