రిహాబిలిటేషన్‌ యూనివర్సిటీతో మేలు | - | Sakshi
Sakshi News home page

రిహాబిలిటేషన్‌ యూనివర్సిటీతో మేలు

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

భూదాన్‌పోచంపల్లి : మానసిక, శారీరక రుగ్మతలు కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు పునరావాస (రిహాబిలిటేషన్‌ ) విశ్వవిద్యాలయం ఉండడం రాష్ట్రానికి ఎంతో మేలు జరగనుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని సెయింట్‌ మేరీస్‌ రిహాబిలిటేషన్‌ యూని వర్సిటీని నల్లగొండ ఎంపీ కె.రఘువీర్‌రెడ్డి, ప్రభు త్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్‌ సందర్శించారు. క్యాంపస్‌ మొత్తం కలియదిరిగారు. సెంటర్‌లో పిల్లలు తయారు చేసిన బొమ్మలు, దీపావళి దివ్వెలు పరిశీలించారు. రూ.300 చెల్లించి దివ్వెలు కొనుగోలు చేసి పిల్లలను అభినందించారు. ఫిజి యో, ఆక్యుపెషనల్‌ థెరపీ సెంటర్లను సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వ్యవస్థాపకుడు రెవరెండ్‌ కేవీకే రావు యూనివర్సిటీ లక్ష్యాలను వివరించారు. ప్రభుత్వం మరింత సహకారం అందిస్తే న్యూరో పిల్లలందరికి ఉచిత సేవలందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శ్రీహర్ష, సీఓఓ ఇందుఅపర్ణ, వైస్‌ఛాన్సలర్‌ లెప్టినెంట్‌ జనరల్‌ ప్రదీప్‌నాయర్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శ్రీపతిద్వారకానాథ్‌, రాంబాబు, శివ, సర్పంచ్‌ దుర్గం జంగయ్య, ఉపసర్పంచ్‌ నూకల అశోక్‌, పీఏసీఎస్‌ పీఐసీ చైర్మన్లు పాక మల్లేశ్‌, కళ్లెం రాఘవరెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పునూతుల వెంకటేశం, ఏర్పుల శ్రీనివాస్‌, మోహన్‌రెడ్డి, జక్కలి శంకర్‌, గుండాల రాజారాం, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement