నాణ్యతలేని
సరుకులు..
ఈ ఫొటో కనిపిస్తున్నవి నాసిరకం పల్లీలు. భువనగిరిలోని ఓ వసతి గృహానికి సరఫరా చేశారు. సెప్టెంబర్ నుంచి ప్రతినెలా ఇలాగే నాసిరకంగా సరఫరా అవుతున్నాయని హాస్టల్ వంట నిర్వాహకులు చెబుతున్నారు. ఇలాంటి పల్లీలతో చట్నీ చేస్తే విద్యార్థులకు విరేచనాలు పెట్టే ప్రమాదముందని అంటున్నారు. జిల్లాలో ప్రతి సంక్షేమ హాస్టల్‌కు ఇలాగే నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నా అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
సాక్షి, యాదాద్రి : సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీలకు సరఫరా చేస్తున్న వంట దినుసులు నాసిరకంగా ఉంటున్నాయి. సెప్టెంబర్ నెల నుంచి నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టిన కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. సరిపడా సరుకుల రాకపోవడం.. వచ్చినవి కూడా నాణ్యమైనవి కాకపోవడంతో వండి పెట్టడానికి వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు భయాందోళన చెందుతున్నారు. దీంతో కావాల్సిన సరుకులను ఏ రోజుకారోజు కొనుగోలు చేస్తున్నామని వాపోతున్నారు.
సరుకుల నాణ్యతపై ఆందోళన
నాప్కాబ్ సంస్థ ద్వారా జిల్లాలోని గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, అర్బన్ స్కూళ్లకు సరఫరా అవుతున్న సరుకుల నాణ్యతపై ఇటీవల పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. జిల్లాకు వేలాది మంది విద్యార్థులకు అవసరమైన సరుకులు మహబూబాబాద్ నుంచి సరఫరా అవుతున్నాయి. ప్రధానంగా కందిపప్పు, శనగపప్పు, పెసర పప్పు, పల్లీలు, ఆవాలు, సాజీర, ఇడ్లీపిండి, బెల్లం వంటి అన్ని నిత్యావసర సరుకులు నాసిరకంగా వస్తున్నాయని అధికారుల పరిశీలనలో గుర్తించారు. పలు వసతి గృహాలకు సరిపోను సరుకుల సరఫరా జరగడంలేదు. దీనికి తోడునాణ్యతా ఉండకపోవడంతో అవి తినడానికి పనికిరాకుండా ఉంటున్నాయని, విద్యార్థులకు పౌష్టికాహారం అందకుండా పోతుందని, నాసిరకం సరుకులతో వండిన వంట తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైతే బాధ్యులు ఎవరని వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు.
ఆన్‌లైన్ ప్రక్రియతో ఇబ్బందులు
ఈ టెండర్, డెలివరీ వ్యవస్థ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1నుంచి రాష్ట్రమంతా ఉన్న వసతి గృహాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టు ఒక్కరికే అప్పగించారు. నాప్కాబ్ సంస్థకు ఆగస్టు 27నే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆయా వసతి గృహాలకు అవసరమైన సరుకుల ఇండెంట్‌ను యూనిఫైడ్ వెల్ఫేర్ హాస్టల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (యూహెచ్‌ఎంఎస్) పోర్టల్‌లో నమోదు చేస్తే సరుకుల పంపిణీ జరుగుతోంది. అయితే స్థానికంగా తలెత్తే సమస్యలపై తక్షణ స్పందన కరువైందని, ఇండెంట్ జనరేట్ చేయడం, సరుకులు మార్చుకోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా..
Æ>çÙ‰ Ýë¦Æ‡$$-ÌZ E¯]l²-™é«¨-M>Æý‡$-ÌSMýS$, MýSÌñæ-MýStÆý‡Ï §ýl–íÙŠిrP çÜÐ]l$-çÜů]l$ ¡çÜ$-MðS-ãϯé çÜÆý‡$-MýS$ÌS çÜÆý‡-çœÆ> ¡Æý‡$ Ð]l*Æý‡-MýS-´ù-Ð]lyýl… VýSÐ]l$-¯éÆý‡á…. Csîæ-Ð]lÌS ¿¶æ$Ð]l-¯]l-WÇ Ð]l$…yýl-ÌS… ¯]l…§ýl-¯]l…-ÌZ° àçÜtÌŒæ ™èl°TMìS Ð]l_a¯]l ½ïÜ çÜ…„óSÐ]l$ Ô>Q MýSÑ$çÙ-¯]lÆŠ‡ §ýl–íÙtMìS Ý린MýS A«¨M>Æý‡$-Ë$ ¡çÜ$-MðS-âêÏÆý‡$. AƇ$$-¯]l-ç³µ-sìæMîS Ð]l*Æý‡$µ MýS°í³…^èlyýl… Ìôæ§ýl$. AƇ$$™ól çÜÆý‡$-MýS$-Ë$ ¯éíÜ-Æý‡-MýS…-V> Ð]lçÜ$¢…yýl-yýl…-™ø Ð]l…yìl-ò³sôæt ÐéÆð‡z¯]l$Ï, ç³Æý‡Å-Ðól-„ìS…^ól A«¨M>Æý‡$-Ë$ ¯ðl†¢ç³-r$t-MýS$…r$-¯é²Æý‡$. Ð]l*sìæ-Ð]l*-sìæMîS Oò³A«¨M>Æý‡$-ÌSMýS$ ^ðlç³µ-ÌôæMýS, ¯éíÜ-Æý‡MýS… ¨¯]l$-çÜ$-ÌS-™ø ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ Ð]l…yìl ò³rtÌôæMýS H… ^ólĶæ*-ÌZ AÆý‡¦… M>Ð]l-yýl…-Ìôæ-§ýl° ÐéÆð‡z¯]l$Ï, A«¨M>Æý‡$-Ë$ Ðé´ù-™èl$-¯é²Æý‡$. C¨Ìê E…sôæ ¯éíÜ-Æý‡MýS… Ð]lçÜ$¢-Ð]l#ÌS çÜÆý‡-çœÆ> ºíßæ-Æý‡…VýS Æý‡çßæ-çÜÅÐól$ M>° ºÄ¶æ$-rç³yìl ^ðlç³µ-Ìôæ-Ð]l$° K hÌêÏ A««¨M>Ç õ³ÆöP-¯]lyýl… VýSÐ]l$-¯éÆý‡á….
ఫ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు సరఫరా చేస్తున్న కాంట్రాక్టు సంస్థ
ఫ చాలీచాలని సరుకులతో ఇబ్బందులు
ఫ కావాల్సిన వాటిని ఏరోజుకారోజు కొంటున్న హాస్టల్ వార్డెన్లు
ఫ సరుకుల మార్పిడిలోనూ సమస్యలే ఎదురవుతున్నాయని ఆవేదన


