విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో జీవించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో జీవించాలి

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

భువనగిరి : విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో జీవిస్తూ అన్నిరంగాల్లో రాణించాలని, యువజనోత్సవాల్లో తమ ప్రతిభను చాటుకోవాలని భువనగిరి మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్‌ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజనోత్సవాల్లో భాగంగా శుక్రవారం భువనగిరి పట్టణంలోని ఖిలా వద్ద నిర్వహించిన జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు, షెడ్యూల్‌ కులాల సంక్షేమ అధికారి శ్యామ్‌సుందర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వాతి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అశ్విన్‌, డాక్టర్‌ రాజ్‌కుమార్‌, హెరిటేజ్‌ కమిటీ సభ్యులు వెంకట్‌రెడ్డి, అంజయ్య, కౌన్సిలర్‌ బండారు స్వర్ణలత, డ్యాన్స్‌ కపిల్‌, రమేష్‌రాజ్‌, శ్రీనివాస్‌, భరత్‌, గణేష్‌, నవభారత యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కరుణ్‌ పాల్గొన్నారు.

విజేతలు వీరే..

జానపతం నృత్యంలో విజ్ఞాన్‌ కళాశాల (భువనగిరి) ప్రథమ, మాంటిస్సోరి స్కూల్‌ (బీబీనగర్‌) ద్వితీయ బహుమతులు పొందాయి. జానపద గేయాల విభాగంలో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల (భువనగిరి) ప్రథమ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(నారాయణపూర్‌)ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. వీధి నాటకంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(నారాయణపూర్‌) ప్రథమ స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement