లబ్ధిదారు మరణిస్తే.. భార్యకు పింఛన్‌ | - | Sakshi
Sakshi News home page

లబ్ధిదారు మరణిస్తే.. భార్యకు పింఛన్‌

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

రామన్నపేట: ప్రభుత్వం అందించే చేయూత పింఛన్‌ పొందుతున్న లబ్ధిదారుడు ఏ కారణం చేతనైనా మరణిస్తే, ఇకపై ఆ పింఛన్‌ను వెంటనే అతని భార్య పేరుమీదకు బదిలీ చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

అన్ని కేటగిరీలకూ వర్తింపు

గతంలో భర్త మరణిస్తే కేవలం వృద్ధాప్య పింఛన్‌ మార్పిడికి మాత్రమే తక్షణ అవకాశం ఉండేది. మిగిలిన కేటగిరీల వారికి ఈ వెసులుబాటు ఉండేది కాదు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, డయాలసిస్‌, హెచ్‌ఐవీ, ఫైలేరియా తదితర అన్ని కేటగిరీల పింఛన్‌దారుల కుటుంబాలకు ఈ ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో ప్రస్తుతం 94,288 మంది వివిధ కేటగిరీల కింద పింఛన్లు పొందుతుండగా, ప్రభుత్వం నెలకు రూ. 23.68 కోట్లు వెచ్చిస్తోంది. లబ్ధిదారుల మరణానంతరం వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వయసు ఆధారంగా పింఛన్‌ ఖరారు

పింఛన్‌ పొందుతున్న వ్యక్తి మరణిస్తే, అతని భార్య వయసు ఆధారంగా పింఛన్‌ కేటగిరీని మారుస్తారు. భార్య వయసు 57 సంవత్సరాలు పైబడి ఉంటే ‘వృద్ధాప్య పింఛన్‌’, 57 ఏళ్లలోపు ఉంటే ‘వితంతు పింఛన్‌’గా మార్చి మంజూరు చేస్తారు.

దరఖాస్తు విధానం ఇలా..

లబ్ధిదారుడు మరణించిన పక్షంలో, భార్య తన ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ మొదటి పేజీతో పాటు మరణించిన భర్త ఆధార్‌ కార్డు, డెత్‌ సర్టిఫికెట్‌ను జతచేసి గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీ కార్యదర్శికి, పట్టణాల్లో అయితే వార్డు ఆఫీసర్‌కు అందజేయాలి. వారు ఆ దరఖాస్తును పరిశీలించిన అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సంబంధిత మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (ఎంపీడీఓ)లేదా మున్సిపల్‌ కమిషనర్‌ లాగిన్‌కు పంపుతారు. తుది దశలో కలెక్టర్‌ ఆమోదం తెలపగానే తక్షణమే పింఛన్‌ మంజూరవుతుంది.

ఫ వృద్ధాప్యంతో పాటు ఇకపై అన్ని కేటగిరీల పింఛన్ల మార్పిడికి అవకాశం

ఫ ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ కల్పించిన ప్రభుత్వం

ఫ భార్య వయసు ఆధారంగా వృద్ధాప్య లేదా వితంతు పింఛన్‌ మంజూరు

ఫ అధికారులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement