యాదగిరి క్షేత్రంలో ఊంజల్‌ సేవోత్సవం | - | Sakshi
Sakshi News home page

యాదగిరి క్షేత్రంలో ఊంజల్‌ సేవోత్సవం

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజల్‌ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆండాళ్‌ అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆండాళ్‌ అమ్మవారిని ప్రత్యేక పల్లకిపై అధిష్టించి ఆలయ తిరుమాడ వీధుల్లో భక్తుల నడుమ ఊరేగించారు. అద్దాల మండపంలో ఆండాళ్‌ దేవిని అధిష్టించి ఊంజల్‌ సేవోత్సవాన్ని జరిపించారు. ఆలయంలో రాత్రి వరకు పూజలు కొనసాగాయి.

రేషన్‌ ఇవ్వట్లేదా..

ఫిర్యాదు చేయండిలా

భువనగిరిటౌన్‌ : రేషన్‌ సరుకుల పంపిణీలో అవకతవకలు జరగకుండా, లబ్ధిదారులు కోటా పొందే విషయంలో అనుమానాలకు తావులేకుండా ప్రభుత్వం రేషన్‌ షాపుల వద్దే ప్రత్యేక సమాచార పోస్టర్లను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన కింద ఉచితంగా అందుతున్న రేషన్‌ సరుకులను పోస్టర్ల ద్వారా స్పష్టంగా ప్రదర్శించారు. డీలర్లు సరుకులు ఇవ్వడానికి నిరాకరించినా, తూకంలో తేడా కనిపించినా వెంటనే 14457 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. పోస్టర్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి వాట్సాప్‌ ద్వారా సాయం పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

నీటిని పొదుపుగా వాడాలి

యాదగిరిగుట్ట : ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రత్యేక పర్యవేక్షకుడు డాక్టర్‌ అనిమేష్‌ భట్టాచార్య అన్నారు. తుర్కపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఆయన నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ప్రతి ఇంటికి అందుతున్న తాగునీటి సరఫరాపై ప్రజల వద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులకు అందుతున్న తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ సోముల వెంకటేశం, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ మంజుషారాణి, మండల వైద్యాధికారి రాంరెడ్డి, డీఈ ప్రశాంత్‌రెడ్డి, ఈఈలు అనంత్‌, శ్రీజ, ఉప సర్పంచ్‌ పల్లె నరేష్‌గౌడ్‌, కార్యదర్శి మహేందర్‌ పాల్గొన్నారు.

డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల సమ్మె

భువనగిరిటౌన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్స్‌ రాష్ట్ర యూనియన్‌ సమస్యల సాధన కమిటీ డిసెంబర్‌ 15 నుంచి సమ్మెకు దిగనున్నట్లు పిలుపునిచ్చింది. ఈ మేరకు భువనగిరి కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌ఓకు సీఐటీయూ, బీఆర్‌టీయూ నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.18వేలు కనీస వేతనం, రూ.50 లక్షల ప్రమాద బీమా, రూ.5 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలన్నారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి, మాయ కష్ణ, వెంకటమ్మ, లలిత, జ్యోతి, శంకరమ్మ, అమత, భవాని, సరిత, ఎల్లమ్మ పాల్గొన్నారు.

అధ్యాపకులు ఏఐని వినియోగించాలి

నల్లగొండ టూటౌన్‌ : ప్రాజెక్టు రూపకల్పనలో ఏఐని వినియోగించాలని ఎంజీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఖాజాఅల్తాఫ్‌ హుస్సేన్‌ అధ్యాపకులకు సూచించారు. శుక్రవారం నల్లగొండలోని ఎంజీయూలో ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకుల కోసం నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ముగింపు సభలో మాట్లాడారు. కార్యక్రమంలో విభాగ అధిపతి జయంతి, ప్రిన్సిపాల్‌ హరీష్‌కుమార్‌, రేఖ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ డైరెక్టర్‌ ఆకుల రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement