జ్యోతిర్లింగాల దర్శనానికి టూరిస్ట్‌ రైలు | - | Sakshi
Sakshi News home page

జ్యోతిర్లింగాల దర్శనానికి టూరిస్ట్‌ రైలు

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

భువనగిరి : జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం కోసం భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు ఈ నెల 10న హైదరాబాద్‌ నుంచి ప్రారంభం కానున్నట్లు ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్‌ మేనేజర్‌ పీవీ వెంకటేష్‌ తెలిపారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో గల వెయిటింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉజ్జయిని, ద్వారక, సోమనాఽథ్‌, పూణె, నాసిక్‌, ఛత్రపతి సంభూజీ నగర దర్శన్‌ కోసం సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమై కామారెడ్డి, నిజామాబాద్‌, ధర్మాబాద్‌ మీదగా వెళ్తుందన్నారు. ఈనెల 20 వరకు సాగే ఈ యాత్రకు సాధారణ టికెట్‌ రూ.18వేలు, డబుల్‌ ఏసీకి రూ.27,400 వరకు ఉంటుందన్నారు. అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, చిదంబరానికి ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 1వ తేది వరకు మరో యాత్ర నసాగుతుందన్నారు. ఈ యాత్ర చేసేందుకు సాధారణ టికెట్‌ రూ.15,800, త్రి ఏసీ ధర రూ.23,200 ఉంటున్నారు. టికెట్‌ బుకింగ్‌, పూర్తి వివరాలకు సెల్‌ 9701360701, 9281030744, 9281030734 నంబర్లను సంప్రదించాలని కోరారు. సమావేశంలో ఉద్యోగులు ప్రశాంత్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement