సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గంలో రూ.114కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ రోడ్ల అభివృద్ధితో మునుగోడు నియోజకవర్గం ముఖచిత్రం మారిపోతుందన్నారు. గురువారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆర్‌అండ్‌బీ నిధులతో డబుల్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సర్వేల్ గ్రామంలో మూడు ప్రధాన రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. పొర్లగడ్డ తండా నుంచి పీసీ తండా క్రాస్ రోడ్డు వరకు, పొర్లగడ్డ తండా నుంచి గరికగడ్డ తండా వరకు, కేలోతు తండా నుంచి బండలేమునూరు (రంగారెడ్డి జిల్లా)వరకు చేపట్టనున్న రోడ్డు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుడిమల్కాపూర్ నుంచి చల్మెడ వరకు సర్వేల్ మీదుగా డబుల్ రోడ్డు, నారాయణపురం నుంచి సర్వేల్ వరకు, సర్వేల్ నుంచి పలివెల వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా.. పొర్లగడ్డతండాలో ప్రొటోకాల్ నేపథ్యంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కరెంటోతు శ్రీనునాయక్, రెడ్యానాయక్, ఎనుముల శంకర్‌రెడ్డి, జక్కలి ఐలయ్యయాదవ్, కుక్కల నర్సింహ, చిలకరాజు చందన, రాజు, ఉప్పల లింగస్వామి, లోడే రఘు, గుత్త ఉమాదేవి, మన్నే శ్రీనివాస్‌రెడ్డి, కరెంటోతు భిక్షపతి నాయక్, గడ్డం యాదగిరి, రవి, రాహుల్ తదితరులున్నారు.
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి


