సాగునీటికి మరో ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

సాగునీటికి మరో ఉద్యమం

Sep 4 2026 2:42 AM | Updated on Sep 4 2026 2:42 AM

మిర్యాలగూడ : నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పరిధిలోని సాగు భూములకు సాగునీటి విడుదల కోసం మరో పోరాటం తప్పదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నల్లగొండ జిల్లా పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా వెలుగొందిందని, రైస్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా పేరుగాంచిన మిర్యాలగూడ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలో చేపట్టిన రైతు మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆంధ్రా ప్రాంతం వారు నీటిని తరలించుకుపోతున్నా జిల్లా మంత్రులు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఆయకట్టు రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పించిన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు దద్దమ్మలుగా మిగిలిపోయారన్నారు. సాగునీటి విషయంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎడమకాల్వకు నీటి విడుదల చేసేది లేదని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రైతు మహా ధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నిందని, అయినా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారని అన్నారు. పదేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలో సాగర్‌ ఎడమ కాలువ ద్వారా నీళ్లిస్తే రైతులు ఆనందంగా పండించుకున్నారని, అలాంటి ఇప్పుడు ఈ ప్రాంత రైతుల కళ్లల్లో కన్నీళ్లు చూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగర్‌ గేట్లను బద్దలు కొటైనా నీటిని తీసుకుంటామన్నారు. కృష్ణా జలాల హక్కుల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నికర జలాలను వాడుకొని 17 పర్యాయాలు రైతుల శ్రేయస్సు కోసం నీటిని విడుదల చేసిన ఘనత నాటి సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలోనే మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, గాదరి కిశోర్‌కుమార్‌, నోముల భగత్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, మాజీ జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నాయకులు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, దుర్గంపూడి నారాయణరెడ్డి, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, కడారి అంజయ్య, ఎండి.యూసుఫ్‌, నిమ్మల నవీన్‌రెడ్డి, ధనావత్‌ చిట్టిబాబునాయక్‌, ఫహీమొద్దిన్‌, ఇలియాస్‌,మట్టపల్లి సైదులుయాదవ్‌, నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, హాతీరాంనాయక్‌, ఎండి.షోయబ్‌, మల్లయ్యయాదవ్‌ పాల్గొన్నారు.

ఫ సాగర్‌ నీటి విడుదల కోసం పోరాటం చేస్తాం

ఫ ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణ’.. ఇప్పుడు ఎడారిగా మారింది

ఫ నల్లగొండ జిల్లా మంత్రులు దద్దమ్మలు

ఫ సాగునీరు తరలించుకుపోతున్నా పట్టించుకోవట్లేదు

ఫ రైతు మహాధర్నాలో కేటీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement