ఎల్‌నినో ప్రభావంతో 15 మండలాల్లో కరువు ఛాయలు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ప్రభావంతో 15 మండలాల్లో కరువు ఛాయలు

Sep 4 2026 7:17 AM | Updated on Sep 4 2026 7:17 AM

మూడు నెలల్లో కురవాల్సిన, కురిసిన వర్షం వివరాలు మిల్లీ మీటర్లలో

మండలం కురవాల్సింది కురిసింది లోటు వర్షపాతం

తుర్కపల్లి 326.4 232.2 –29

రాజాపేట 341.3 202.5 –41

ఆలేరు 390.8 214.9 –45

మోటకొండూరు 386.6 227.1 –41

యాదగిరిగుట్ట 397.9 264.2 –34

భువనగిరి 431.9 221.8 –49

బి.రామారం 359,7 281.2 –22

బీబీనగర్‌ 390.3 211.8 –46

పోచంపల్లి 386.4 263.2 –32

చౌటుప్పల్‌ 311.7 211.7 –32

నారాయణపురం 237.5 198.0 –17

రామన్నపేట 379.8 188.3 –50

వలిగొండ 407.5 292.8 –28

ఆత్మకూర్‌– ఎం 340.6 285.7 –16

మోత్కూరు 435.0 322.4 –28

అడ్డగూడూరు 429.9 309.3 –28

గుండాల 437.3 246.5 –44

మొత్తం 375.9 245.5 –35

సాక్షి, యాదాద్రి: వరుణుడు ముఖం చాటేశాడు. వానాకాలం సీజన్‌లో మూడు నెలలు దాటినా చినుకు జాడ కన్పించడంలేదు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సాధారణం కంటే 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 17 మండలాలకు గాను ఏకంగా 15 మండలాలు కరువు జాబితాలోకి వెళ్లాయి. దీంతో పంటలు ఎదిగే దారిలేక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది.

సాధారణం కంటే పడిపోయిన వర్షపాతం

జూన్‌, జూలై, ఆగస్టు 31 నాటికి జిల్లాలో వర్షపాతం సాధారణ స్థాయి కంటే గణనీయంగా పడిపోయింది. సాధారణంగా ఈ మూడు నెలల్లో కలిపి 375.9 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 245.5 మి.మీ మాత్రమే కురిసింది. ఈ సీజన్‌ మొత్తంలో జిల్లాలోని 17 మండలాల్లో కేవలం రెండు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సంస్థాన్‌ నారాయణపూర్‌లో (–17శాతం), ఆత్మకూర్‌–ఎంలో 16శాతం లోటువర్షపాతం ఉంది. ఈరెండు మండలాలను సాధారణ వర్షపాతం పరిధిలో చేర్చారు.

తీవ్ర లోటు ఉన్న మండలాలు15

జిల్లాలోని 15 మండలాలు తీవ్ర వర్షాభావంతో లోటు జాబి తాలో చేరాయి. రామన్నపేట మండలంలో అత్యధికంగా 50శాతం లోటు నమోదు అంటే (సాధారణం 379.8 మిమీ కి గాను 188.3 మిమీ మాత్రమే), భువనగిరి మండలంలో 49 శాతం లోటు వర్షపాతం (221.8 మిమీ). బీబీనగర్‌ 46శాతం, ఆలేరు 45శాతం, గుండాల 44శాతం లోటు వర్షపాతం నమో దైంది. అంటే ఆయా మండలాలు కరువు పరిస్థితుల్లోకి వెళ్లాయి. తీవ్రవర్షాభావ లోటు మెట్ట, తరిపంటలపై ప్రభావం పడింది.

పంటల సాగు అంచనాలు తలకిందులు

జిల్లాలో ఈ సారి పంటల సాగులో వ్యవసాయ శాఖ అంచనాలు తలకిందులయ్యాయి. అన్ని పంటలు కలిపి4,66,604 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేయగా 3,80,145 ఎకరాల్లో సాగు చేశారు. వీటిలో వరి 2,03,744 ఎకరాల్లో సాగు అయ్యింది. వీటిలో మూసీ ఆయకట్టులోనే 96,564 ఎకరాలు కాగా మిగతాదంతా వర్షాలు, భూగర్భ జలాలమీదనే ఆధారపడి సాగు చేశారు. పత్తిసాగు మీద వర్షాకాలం ప్రభావం తీవ్రంగా పడింది. 1,12,079 పత్తిసాగైంది. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా కందుల సాగు 16,375 ఎకరాల్లో సాగు చేశారు.

చుక్క నీరు లేక చెరువులు వెలవెల

జిల్లాలోని 1,155 నీటి వనరుల్లో మూసీ నది పరివాహక ప్రాంతంలోని 90 చెరువులు మినహా మిగిలినవన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాలోని చెరువులన్నీ నిండితే 10 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉండేది, కానీ ప్రస్తుతం కేవలం 3 టీఎంసీలు అందుబాటులో ఉంది. అలుగులు పోసిన చెరువులు 12, 75శాతం నుంచి వందశాతం నిండినవి 78, 50శాతం నుంచి 75శాతం నిండినవి 178, 25శాతం నుంచి 50శాతం నిండినవి 217, 25శాతం కంటే తక్కువ నిండినవి 670 చెరువులు ఉన్నాయి.

ఫ జిల్లాలో 35శాతం లోటు వర్షపాతమే

ఫ ఆశలు వమ్ము చేసిన ఆగస్టు

ఫ దిక్కుతోచని స్థితిలో రైతాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement