బీఆర్‌ఎస్‌ పోరాట ఫలితమే ‘డబుల్‌’ ఇళ్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పోరాట ఫలితమే ‘డబుల్‌’ ఇళ్ల పంపిణీ

Sep 4 2026 7:17 AM | Updated on Sep 4 2026 7:17 AM

భువనగిరి టౌన్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో భువనగిరి పట్టణంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలంటూ తమ పార్టీ చేసిన పోరాటాల ఫలితంగానే నేడు గృహప్రవేశాలు సాధ్యమయ్యాయని బీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సొంతింటి కల సాకారమైనందుకు కృతజ్ఞతగా లబ్ధిదారులు, బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా కేసీఆర్‌ ఆలోచన, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చొరవతో భువనగిరిలో 444 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా అర్హులైన నిరుపేదలను లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ఎంపిక చేసి పట్టాలు అందజేసినట్లు గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం చివరకు మొదటి విడత గృహప్రవేశాలు చేయించిందన్నారు. మిగిలిన 10 శాతం పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, రెండో విడత లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, ఖాజా అజిమోద్దీన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement