ఎల్‌నినో దెబ్బకు జొన్న, పప్పుధాన్యాలు సహా ఇతర పంటల సాగు విస్తీర్ణం కూడా పడిపోయింది. అయితే, కందుల సాగు మాత్రం ఆశాజనకంగా ఉంది. వ్యవసాయ అధికారులు కేవలం 5 వేల ఎకరాల్లో కందులు సాగవుతాయని అంచనా వేయగా, వాస్తవానికి 8 నుంచి 12 వేల ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భువనగిరి: వానాకాలం సీజన్‌పై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపింది. వాతావరణ శాఖ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో ప్రధాన పంటలైన వరి, పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం చేసిన విస్తృత ప్రచారం ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వలేదు.
ఆశించిన స్థాయిలో సాగని ఆరుతడి పంటలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయన్న అంచనాలతో, వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం వివిధ రూపాల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు విత్తనాలను సైతం విక్రయించింది. అయినప్పటికీ జిల్లాలో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు ఆశించిన స్థాయిలో మొగ్గు చూపలేదు.
లక్ష్యానికి ఆమడదూరంలో వరి, పత్తి
జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 3.05లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేశారు. కానీ, ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు కేవలం 1.91 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. అదేవిధంగా పత్తి సాగు 1.40 లక్షల ఎకరాలకు చేరుకుంటుందని అంచనా వేయగా.. ఇప్పటి వరకు 1.12 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. గత వానాకాలం సీజన్‌లో వరి 97.08శాతం సాగు చేయగా ఈ సారి 62శాతం మాత్రమే సాగైంది. పత్తి గత వానాకాలం సీజన్‌లో 99.30శాతం వేయగా ఈ సారి 80శాతమే సాగు చేశారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని విస్తృతంగా ప్రచారం చేశాం. వరి విస్తీర్ణం తగ్గింది, అయితే పత్తి పంట సాగు పెరుగుతుందని ఆశించాం.. కానీ తగ్గింది.
– పీవీ రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
ఫ లక్ష్యాన్ని చేరుకోని ప్రధాన పంటల సాగు
ఫ ప్రభుత్వం ప్రోత్సహించినా ఆరుతడి పంటలపై ఆసక్తి చూపని రైతులు
ఫ అంచనాలకు మించి సాగవుతున్న కందులు
పంటల సాగు వివరాలు (ఎకరాల్లో)
పంట గత వానాకాలం సాగైంది ఈసారి సాగు సాగైంది
అంచనా అంచనా
వరి 2,98,711 2.90 లక్షలు 3.05 1.91
పత్తి 1,34,941 1.34 లక్షలు 1.40 లక్షలు 1.12 లక్షలు


