ఆలేరు : తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియకు శతాబ్దాల చరిత్ర ఉందని, కవి బండిరాజుల శంకర్ రచించిన నిత్యసత్యాలు శాంకరీయం శతక సంపుటి నేటి సమాజానికి దర్పణంలాంటిదని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు, ప్రముఖ కవి, ఆచార్య మసక చెన్నప్ప పేర్కొన్నారు. మంగళవారం ఆలేరు పట్టణంలోని శ్రీరామకృష్ణ విద్యాలయం ప్రధానాచార్యులు,కవి బండిరాజుల శంకర్ రచించిన నిత్యసత్యాలు–శాంకరీయం శతక సంపుటి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సామాన్య పాఠకుడికి సైతం అర్థమయ్యేలా సరళమైన భాష, సులభమైన శైలిలో శతకాన్ని రచించడం శాంకరీయం ప్రత్యేకత అని చెప్పారు. అనంతరం పాఠశాల విద్యార్థిని కాసులబాద నిత్యశ్రీ భరతనాట్యం ఆకట్టుకుంది. ఈకార్యక్రమంలో డాక్టర్ లింగంపల్లి రాంచంద్ర, డాక్టర్ భేరి సునీతారాంమోహన్‌రెడ్డి, డాక్టర్ పాండాల మహేశ్వర్, డాక్టర్ పోరెడ్డి, రంగయ్య, డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ, పాలకుర్తి రామమూర్తి, ఎన్‌సీసీ అధికారి దూడల వెంకటేష్, వివిధ పాఠశాలల కరస్పాండెంట్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ ఓయూ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య మసక చెన్నప్ప


